corona cases India : భారత్‌లో కరోనా కల్లోలం..24 గంటల్లో 56,211 పాజిటివ్ కేసులు

భారత్‌లో కరోనా కల్లోలం కంటిన్యూ అవుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 56 వేల 211 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 271 మంది ఈ మహమ్మారి బారిన పడి మృతి చెందారు.

Covid19

corona positive cases increase in India : భారత్‌లో కరోనా కల్లోలం కంటిన్యూ అవుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 56 వేల 211 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 271 మంది ఈ మహమ్మారి బారిన పడి మృతి చెందారు.. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య 10 వేలకు పైగా తగ్గడం కాస్త ఊరటనిచ్చే విషయం..

దేశంలో అంతకముందు వారంతో పోలిస్తే ఏకంగా 51శాతం అధికంగా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. ఈ ఒక్క వారంలోనే 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. గతేడాది అక్టోబర్‌ తర్వాత ఒక్క వారంలో ఇన్ని కేసులు రికార్డవ్వడం ఇదే మొదటిసారి.

దేశంలో ప్రస్తుతం ప్రస్తుతం 5 లక్షల 40 వేలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 94.32 శాతంగా ఉంది.. ఇక దేశవ్యాప్తంగా రికార్డయిన కరోనా కేసుల్లో కేవలం ఆరు రాష్ట్రాల నుంచే 80శాతం కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో భారీగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.