Corona Third Wave : భారత్‌ కు కరోనా థర్డ్‌ వేవ్‌ ముప్పు..!

కరోనా సెకండ్‌ వేవ్‌ దెబ్బకు అల్లాడుతున్న భారత్‌కు థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉంది. అటు ప్రతిరోజు రికార్డ్‌ స్థాయిలో కేసులు నమోదవడం నిపుణులను సైతం కలవర పెడుతుంది.

Corona third wave threat to India : కరోనా సెకండ్‌ వేవ్‌ దెబ్బకు అల్లాడుతున్న భారత్‌కు థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉంది. అటు ప్రతిరోజు రికార్డ్‌ స్థాయిలో కేసులు నమోదవడం నిపుణులను సైతం కలవర పెడుతుంది. కేసుల్లోనే కాదు మరణాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సెకండ్‌ వేవ్‌కే జనం పిట్టల్లా రాలిపోతుంటే.. కేంద్రం మరో వార్నింగ్ ఇచ్చింది. థర్డ్‌ వేవ్‌ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకూ సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు సూచించింది. ఆస్పత్రుల్లో బెడ్స్‌ పెంచుకోవాలని, ఆక్సిజన్ నిల్వలు పెంచుకోవాలని సూచించింది.

భారత్‌లో ఒక్కరోజులో రికార్డు స్థాయిలో దాదాపు 3 లక్షల 80 వేల కేసులు నమోదయ్యాయి. తొలిసారిగా 24 గంటల్లోనే 3 వేల 645 మందిని వైరస్ బలితీసుకుంది. దేశంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఒక్కరోజులో ఇన్ని మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. అటు దేశం కోసం శత్రుదేశాలతో ఫైట్‌ చేస్తోన్న భారత సైన్యం.. ఇప్పుడు వైరస్‌పై వార్‌కు సిద్ధమైంది. కరోనా బారిన పడ్డ ప్రజలకు అత్యవసర ట్రీట్‌మెంట్ ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా తాత్కాలిక ఆర్మీ ఆస్పత్రులను తెరవాలని నిర్ణయించింది. ఆక్సిజన్‌ ట్యాంకర్ల దిగుమతి… వాటిని తరలించే బాధ్యతలను ఇకపై సైన్యం తీసుకోనుంది.

ప్రధాని మోడీని కలిసిన ఇండియ‌న్ ఆర్మీ చీఫ్ నరవాణే కరోనా కట్టడికి సైన్యం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రధాని సూచన మేరకు ఇకపై క‌రోనా సోకిన సాధార‌ణ పౌరులకు ఆర్మీ ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తామన్నారు నరవాణే. కరోనా కట్టడికి సైన్యం సేవలను విస్తృతంగా వినియోగించుకోనున్నారు. అటు క‌రోనాపై పోరాటంలో భాగంగా ఐక్యరాజ స‌మితి సాయాన్ని భార‌త్ నిరాక‌రించింది. ఈ మ‌హ‌మ్మారిని ఎదుర్కోవ‌డానికి త‌మ ద‌గ్గరే బ‌ల‌మైన వ్యవ‌స్థ ఉన్నద‌ని భార‌త్ తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు