కొత్త సంవత్సరంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభిస్తాం : ప్రధాని మోడీ

  • Published On : December 31, 2020 / 02:01 PM IST

Corona vaccination to begin in new year : ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నామని ప్రధాని మోడీ తెలిపారు. కొత్త సంవత్సరంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని చెప్పారు. గుజరాత్ లోని రాజ్‌కోట్‌లో ఎయిమ్స్ నిర్మాణానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. వ్యాక్సిన్ అందుబాటులోకివచ్చినా..కరోనా జాగ్రత్తలు పాటించాలన్నారు.

కరోనా కేసులు దేశంలో తగ్గుముఖం పడుతున్నాయన్నారు. అయినప్పపటికీ ప్రజలంతా కరోనా జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు. భారత్‌లో వ్యాక్సినేషన్‌పై వదంతులు వ్యాపించే ప్రమాదముందని హెచ్చరించారు ప్రధాని. మనదేశంలో వదంతులు వేగంగా వ్యాపిస్తాయన్నారు. వాటి విషయంలో వివిధ వర్గాలకు చెందిన ప్రజలు బాధ్యత లేకుండా వ్యవహరిస్తారని ప్రధాని ఆరోపించారు.

ఈ వదంతులు వ్యాక్సినేషన్ పైన కూడా ఉంటాయని, టీకా పంపిణీ ప్రారంభం కాగానే మొదలవుతాయని ప్రధాని అన్నారు. కొందరు ఇప్పటికే పుకార్లు మొదలుపెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.