PM Kisan-Annadata Sukhibhava: మీకు ‘అన్నదాత సుఖీభవ’, ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ డబ్బులు రాలేదా.. అయితే ఇలా చేయండి చాలు!
అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు(Government Schemes) మీ ఖాతాలో జమకాకపోతే ఇలా చేయండి.
If PM Kisan Samman Nidhi and annadata sukhibhava funds have not been credited to your account, follow these steps.
- ఈ-కేవైసీ లేకపోతే డబ్బులు రావు.
- ఆధార్‌ను బ్యాంకు ఖాతాకు లింక్ చేయండి.
- సమస్యల కోసం సచివాలయాన్ని సంప్రదించండి.
PM Kisan-Annadata Sukhibhava: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘అన్నదాత సుఖీభవ’ పథకం, అలాగే కేంద్ర ప్రభుత్వ ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ కింద పెట్టుబడి సాయం రైతులకు అందుతోంది. ఈరోజు కూడా దీనికి సంబందించిన నదులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేశాయి. దాంతో, లక్షలాది మంది రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, కొంతమంది రైతులకు మాత్రం సాంకేతిక కారణాల వల్ల ఖాతాల్లో డబ్బులు జమకావడం లేదు. అర్హత ఉండి కూడా మీ ఖాతాలోకి ఈ నిధులు రాకపోతే, కంగారు పడకుండా తక్షణమే కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
*RC Cancellation: పాత వాహనం ఇచ్చేశాక.. ఆర్సీ రద్దు తప్పనిసరి.. లేదంటే న్యాయపరమైన చర్యలు తప్పవు
డబ్బులు పడకపోవడానికి ప్రధాన కారణాలు:
రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు(Government Schemes) పడకపోవడానికి అత్యంత ముఖ్యమైన కారణం ఈ-కేవైసీ (e-KYC) పూర్తి కాకపోవడం. దీంతో పాటు ఆధార్ కార్డ్‌ను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేయకపోవడం (Aadhaar Seeding), భూమి రికార్డుల వివరాలు (Land Missing) సరిగ్గా నమోదు కాకపోవడం, లేదా బ్యాంకు ఖాతా వివరాల్లో తప్పులు ఉండటం వల్ల నిధులు నిలిచిపోతుంటాయి. కాబట్టి, ఆందోళన చెందాల్సిన అవసరంలేదు.
సమస్య పరిష్కారానికి ఏం చేయాలి?
* ముందుగా మీ ఈ-కేవైసీ పూర్తి చేయండి: మీ సమీపంలోని మీసేవ, సీఎస్సీ (CSC) కేంద్రానికి వెళ్లి లేదా పీఎం కిసాన్ అధికారిక పోర్టల్‌లో బయోమెట్రిక్/ఓటీపీ ద్వారా ఈ-కేవైసీని వెంటనే పూర్తి చేయండి.
* ఆధార్ సీడింగ్ చెక్ చేసుకోండి: మీ ఆధార్ నంబర్ మీ బ్యాంకు ఖాతాకు లింక్ అయిందో లేదో మీ బ్యాంకు శాఖకు వెళ్లి సరిచూసుకోండి. అలాగే ఎన్పీసీఐ (NPCI) మ్యాపింగ్ కూడా సక్రియంగా ఉండాలి.
* రెవెన్యూ అధికారులను కలవండి: ఒకవేళ భూమి రికార్డుల సమస్య ఉంటే, మీ గ్రామ సచివాలయంలోని వీఆర్వో (VRO) లేదా వ్యవసాయ సహాయకుడిని (VAO) కలిసి మీ భూమి వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేయించుకోవాలి.
మీరు మీ సచివాలయ పరిధిలోని వ్యవసాయ శాఖ అధికారులకు దరఖాస్తు సమర్పించడం ద్వారా తదుపరి విడతల్లో పాత బకాయిలతో సహా ఒకేసారి డబ్బులు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి, పథకాల డబ్బులు జమ కానీ రైతులు పైన తెలిపిన విధంగా చేయడం ద్వారా డబ్బులు అందుకొనే అవకాశం ఉంటుంది.
