Gujarat Covid : గుజరాత్‌లో కొత్తగా 12,131 కరోనా కేసులు, 30 మరణాలు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వ్యాపిస్తోంది. దేశంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.

Gujarat Covid News Updates : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వ్యాపిస్తోంది. దేశంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా కేసుల్లో హెచ్చుతగ్గుదల కనిపిస్తున్నాయి.

శుక్రవారం (జనవరి 28) గుజరాత్ రాష్ట్రంలో కొత్తగా 12,131 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 30 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,07,915 కొత్త కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో కొత్తగా 24,948 కొవిడ్ కేసులు నమోదు కాగా.. మరో 103 మంది కరోనాతో మృతిచెందారు.

ఇదే సమయంలో గుజరాత్ రాష్ట్రంలో 22,070 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దాంతో రాష్ట్రంలో కరోనా రికవరీ కేసుల సంఖ్య 10,14,501కు చేరింది. దాంతో ప్రస్తుత కరోనా రికవరీ రేటు శాతం 89.56శాతంగా నమోదైంది. అహ్మదాబాద్ సిటీలోనే అత్యంత సంఖ్యలో 4,406 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.

వడోదర సిటీ (1,999 కొత్త కేసులు), రాజ్ కోట్ నగరం (958) కొత్త కేసులు, సూరత్ నగరం (628) కొత్త కేసులు నమోదయ్యాయి. అందిన కరోనా డేటా ప్రకారం.. గుజరాత్ రాష్ట్రంలో మొత్తంగా ప్రతిరోజు దాదాపు కరోనా టెస్టుల సంఖ్య 1.20 లక్షలు నిర్వహించారు. ఇక రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 10.67శాతంగా నమోదైంది.

Read Also : Bangladeshi Woman : 15 ఏళ్లుగా హిందువునంటూ నమ్మించింది.. చివరకు

ట్రెండింగ్ వార్తలు