Bangladeshi Woman : 15 ఏళ్లుగా హిందువునంటూ నమ్మించింది.. చివరకు

రోనీ బేగం (పాయల్ ఘోష్) తండ్రి మూడు నెలల కిందట చనిపోయారు. తండ్రిని కడసారి చూసేందుకు...అంత్యక్రియల కోసం బంగ్లాదేశ్ వెళ్లాలని భావించింది. తొలుత కోల్ కతా వెళ్లింది. అక్కడి నుంచి...

Bangladeshi Woman : 15 ఏళ్లుగా హిందువునంటూ నమ్మించింది.. చివరకు

Bangladesh

Bangladeshi Woman Who Stayed As Hindu : ఒక సంవత్సరం కాదు.. రెండు సంవత్సరాలు కాదు..ఏకంగా 15 సంవత్సరాల పాటు హిందువుగా అందర్నీ నమ్మించిన బంగ్లాదేశ్ యువతి ఆటకట్టించారు పోలీసులు. మూడు నెలల పాటు వెతికిన పోలీసులకు ఈమె ఆచూకిని కనిపెట్టి.. అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది. బెంగళూరులో రోనీ బేగం 12 ఏళ్ల వయస్సులో భారత్ లోకి అక్రమంగా ప్రవేశించింది. అనంతరం పాయల్ ఘోష్ గా పేరు మార్చుకుని…ముంబైలో బార్ లో డ్యాన్సర్ గా పని చేసింది. తాను వెస్ట్ బెంగాల్ కు చెందిన యువతిగా పరిచయం చేసుకొనేది. మంగళూరు ప్రాంతానికి చెందిన డెలివరీ ఎగ్జిక్యూటివ్ నితీన్ కుమార్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. అనంతరం 2019లో బెంగళూరులోని అంజననగర్ లో నివాసం ఉండేవారు. టైలర్ గా పని చేసుకుంటూ జీవిస్తోంది. ముంబైలో ఉన్న సమయంలో పాన్ కార్డులను, బెంగళూరులో ఆధార్ కార్డులను పొందారు.

Read More : Chandrababu Naidu : అంధకారంలో రాష్ట్ర భవిష్యత్తు.. కేంద్రం జోక్యం చేసుకోవాలన్న చంద్రబాబు

ఇదిలా కొనసాగుతుండగా.. రోనీ బేగం (పాయల్ ఘోష్) తండ్రి మూడు నెలల కిందట చనిపోయారు. తండ్రిని కడసారి చూసేందుకు…అంత్యక్రియల కోసం బంగ్లాదేశ్ వెళ్లాలని భావించింది. తొలుత కోల్ కతా వెళ్లింది. అక్కడి నుంచి ఢాకా వెళ్లేందుకు ప్రయత్నించగా..ఆమె పాస్ పోర్టును గమనించిన ఇమిగ్రేషన్ అధికారులకు అనుమానం కలిగింది. ప్రశ్నించగా అక్రమంగా భారత్ కు వలస వచ్చినట్లుగా నిర్ధారించారు. బంగ్లాదేశ్ కు వెళ్లకుండా అడ్డుకోవడంతో వెంటనే బెంగళూరు నగరానికి చేరుకుంది. విదేశీ ప్రాంతీయ నమోదు కార్యాలయం నుంచి ఆ మహిళ సమాచారం బెంగళూరు పోలీసులకు అందింది. మూడు నెలలుగా ఆమె కోసం పోలీసులు వెతికారు. బెంగళరు శివారులో ఉన్నట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లగా.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె భర్త మాత్రం పరారీలో ఉన్నాడు. వీరికి సహకరించిన వారిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.