Chandrababu Naidu : అంధకారంలో రాష్ట్ర భవిష్యత్తు.. కేంద్రం జోక్యం చేసుకోవాలన్న చంద్రబాబు

ఆర్థిక ఉల్లంఘనలతో రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తోందని, దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలని చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటే.. ఇప్పటికిప్పుడు కొత్త జిల్లాలు అంటూ

Chandrababu Naidu : అంధకారంలో రాష్ట్ర భవిష్యత్తు.. కేంద్రం జోక్యం చేసుకోవాలన్న చంద్రబాబు

Chandrababu Naidu

Chandrababu Naidu : పార్టీ ఎంపీలతో చంద్రబాబు పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలపై కేంద్రం దృష్టి పెట్టాలని చంద్రబాబు అన్నారు. ఆర్థిక ఉల్లంఘనలతో రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తోందని, దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలని చంద్రబాబు కోరారు. వైసీపీకి 28మంది ఎంపీలు ఉండి.. 32 నెలల్లో రాష్ట్రానికి ఏం తెచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. పాలన అంటే.. అప్పులు చెయ్యడం, దోచుకోవడం అన్నట్లుగా మారిపోయిందని విమర్శించారు.

AP PRC : ఒకటో తారీఖు వస్తోంది.. జీతాలు వస్తాయా ?

రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలు, రాష్ట్రంలో ఉన్న దారుణ పరిస్థితులపై…. కేంద్రం జోక్యం చేసుకోవాలని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటే.. ఇప్పటికిప్పుడు కొత్త జిల్లాలు అంటూ వైసీపీ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరలేపిందన్నారు. ఉద్యోగుల పీఆర్సీతో పాటు రాష్ట్రంలోని ఇతర సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే ఈ డ్రామా అన్నారు చంద్రబాబు. 28మంది వైసీపీ ఎంపీలు రాష్ట్రం కోసం ఏం సాధించారో చెప్పాలన్నారు చంద్రబాబు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలు ఎవరి కోసం అని అడిగారు. రాష్ట్ర ప్రభుత్వ సమస్యలు, విభజన హామీలు, పెండింగ్ అంశాలపై టీడీపీ పోరాటం చేస్తుందని చంద్రబాబు చెప్పారు.

Type-2 Diabetes: డిన్నర్ లేటవుతుందా.. షుగర్ పెరుగుతుందన్న మాటే..