Type-2 Diabetes: డిన్నర్ లేటవుతుందా.. షుగర్ పెరుగుతుందన్నమాటే..

షుగర్ అదే డయాబెటిస్ కు దూరంగా ఉండాలని ఏం తినాలో ఏం తినకూడదో లెక్కలేసుకుని తిని ఇలాంటి వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు జాగ్రత్త పడతాం. తినే టైం కూడా డయాబెటిస్ పై ఎఫెక్ట్ చూపిస్తుందని

Type-2 Diabetes: డిన్నర్ లేటవుతుందా.. షుగర్ పెరుగుతుందన్నమాటే..

Diabetes

Type-2 Diabetes: అందరిలో ఉండే కామన్ ఆలోచన. షుగర్ అదే డయాబెటిస్ కు దూరంగా ఉండాలని. ఏం తినాలో ఏం తినకూడదో లెక్కలేసుకుని తిని ఇలాంటి వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు జాగ్రత్త పడతాం. కానీ, తినే టైం కూడా డయాబెటిస్ పై ఎఫెక్ట్ చూపిస్తుందని తెలుసా..

రీసెంట్ గా స్పెయిన్ లో ఉన్న 845 మందిపై జరిపిన స్టడీలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఒక్కో వ్యక్తి 8గంటల పాటు ఉపవాసంతో ఉండి తర్వాత రెండు రోజులు సాయంత్రం భోజనం, బ్రేక్ ఫాస్ట్ ను లేట్ గా అందించారు.

రీసెర్చర్లు ప్రతి పార్టిసిపెంట్ జెనెటిక్ కోడ్ ను కూడా కాలిక్యులేట్ చేశారు. రాత్రి టైంలో విడుదలయ్యే మెలటోనిన్ అనే హార్మోన్.. నిద్రపోవడానికి, మెలకువగా ఉంచడానికి ఉపయోగపడుతుంది.

Read Also : మామిడిలో కాయతొలచు పురుగు నివారణ

నేచురల్ గా లేట్ గా తినేవారు, ముందు తినేవారు టైమింగ్ చెక్ చేసి బ్లడ్ షుగర్ లెవల్ పరిశీలించారు వారిలోనూ మెలటోనిన్ ఉత్పత్తి భిన్నంగానే కనిపించింది. మామూలు వారిలో కంటే లేట్ గా డిన్నర్ చేసిన వాళ్లలో మెలటోనిన్ 2.5 రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలిసింది.

లేటుగా ఆహారం తింటే ఇన్సులిన్ లెవల్ తక్కువ కావడంతో పాటు బ్లడ్ షుగర్ లెవల్ ఎక్కువగా ఉంటుందని తేలింది. వీలైనంత వరకూ బెడ్ టైం కంటే చాలా ముందే ఆహారం తీసుకుంటే బ్లడ్ షుగర్ పెరగకుండా ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.