Insect : మామిడిలో కాయతొలచు పురుగు నివారణ

గోలీ సైజు కాయ దశలో ఒక్కొక్క గొంగళి పురుగు ఒకటి కన్నా ఎక్కువ కాయలకు నష్టం కలుగచేస్తాయి.

Insect : మామిడిలో కాయతొలచు పురుగు నివారణ

Mango Insects

Insect : మామిడిలో కాయతొలిచే పురుగులు జనవరి, ఫిబ్రవరి నుండి మే వరకు ఆశిస్తుంటాయి. ఇవి పంటను తీవ్రంగా నష్టపరుస్తాయి. బఠాని సైజలు మామిడికాయ ఉన్న సమయం నుండి పెద్ద సైజు కు చేరే వరుకు ఏదశలోనైనా ఇది పంటను ఆశించే అవకాశం ఉంటుంది. కాయ ముక్కు భాగంలో నల్లటి రంధ్రంతో ఎండిన మామిడికాయ పిందెల గుత్తులు చెట్టుకు వ్రేలాడుతూ కనిపిస్తుంటాయి. ఇలాంటి సమయంలో ఈ పురుగు ఆశించిందన్న విషయం గుర్తించాలి.

గోలీ సైజు కాయ దశలో ఒక్కొక్క గొంగళి పురుగు ఒకటి కన్నా ఎక్కువ కాయలకు నష్టం కలుగచేస్తాయి. సాధారణంగా ఒక్కొక్క మామిడి కాయలో 4-6 గొంగళి వురుగులు ఉంటాయి. చిన్న సైజు కాయలున్నప్పుడు పురుగులు ఒక కాయ నుండి మరొక కాయకు మారి ఎక్కువ నష్టం కలుగచేస్తాయి.

ఎదిగిన లార్వాగులాబి, ఎరుపు అడ్డ చారలతో పొడవుగా ఉంటుంది. పెరిగిన లార్వాలు ఎండిన మామిడి కొమ్మలు, రెమ్మలు బెరడులో నిద్రావస్థలో డిసెంబరు వరకు కాలాన్ని గడుపుతాయి. పిందెలు ఏర్పడిన తరువాత రెక్కల పురుగులుగా రూపాంతరం చెంది, పూత, విందెలతో మళ్ళీ జీవిత చక్రం కొనసాగిస్తాయి.

కాయతొలు పురుగు నివారణ :

మామిడి పంట పూర్తయిన తరువాత ఎండిన కొమ్మలు, ఎండిన పుల్లలను తీసి ఏరివేసి తగులబెట్టాలి. పురుగు ఆశించిన కాయలను చెట్టు నుండి కోసి నాశనం చేసి పురుగు వ్యాప్తిని నివారించాలి.

జనవరి రెండవ పక్షంలో పురుగు మందులైన క్లోరిపైరిఫాస్‌ 20 ఇసి 2.5 మి.లీ. లేదా దైక్లోరోవాస్‌ 1.5 మి.లీ. లేదా తయాక్లోప్రిడ్‌ 1 మి.లీ. లేదా వేపనూనె 3 మి.లీ. + క్లోరిపైరిఫాస్‌ 2.5 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి సాయంత్రం వేళల్లో పిచికారి చేయాలి.