కరోనా ముప్పు, లోక్‌సభ నిరవధిక వాయిదా

దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఎఫెక్ట్ లోక్ సభ పైనా పడింది. కరోనా ముప్పు కారణంగా లోక్ సభ నిరవధిక వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 3వరకు

  • Publish Date - March 23, 2020 / 09:41 AM IST

దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఎఫెక్ట్ లోక్ సభ పైనా పడింది. కరోనా ముప్పు కారణంగా లోక్ సభ నిరవధిక వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 3వరకు

దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఎఫెక్ట్ లోక్ సభ పైనా పడింది. కరోనా ముప్పు కారణంగా లోక్ సభ నిరవధిక వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 3వరకు లోక్ సభ జరగాల్సి ఉంది. కరోనా పంజా విసరడంతో లోక్ సభ వాయిదా నిర్ణయం తీసుకున్నారు. సోమవారం(మార్చి 23,2020) లోక్ సభ వాయిదా పడింది. ఎలాంటి చర్చ లేకుండానే ఆర్థిక బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటు ద్వారా బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం చూపిస్తోంది. కరోనా మృతుల సంఖ్య వేల సంఖ్యలో ఉండగా.. బాధితుల సంఖ్య లక్షల్లో ఉంది. మన దేశంలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. భారత్‌లో అత్యధికంగా మహారాష్ట్రలో 74కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 8కి చేరింది. కరోనా విజృంభణతో మహారాష్ట్ర తీవ్రంగా ప్రభావితమవుతోంది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు ఈ రాష్ట్రంలోనే నమోదవగా.. సోమవారం(మార్చి 23,2020) మరో మరణంతో మహారాష్ట్రలో కరోనా మృతుల సంఖ్య 3కి పెరిగింది. మహారాష్ట్రంలో 144 సెక్షన్ అమలవుతోంది.
 
ప్రస్తుతం మహారాష్ట్ర కరోనా స్టేజ్ ‌3 దిశగా పయనిస్తోంది. ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ తోపే ఈ విషయాన్ని ప్రకటించారు. విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారు దయచేసి బయట తిరగొద్దని ప్రభుత్వం కోరింది. ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచనలు చేస్తున్నారు.

See Also | లాక్ డౌన్ ఉల్లంఘనపై కేంద్రం సీరియస్