Coronavirus : కేరళలో 20,487 కొత్త కేసులు, 181 మరణాలు

కేరళలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే 20,487 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా మరణాలు కూడా 181 వరకు నమోదయ్యాయి.

Coronavirus : కేరళలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోంది. శనివారం (సెప్టెంబర్ 11) ఒక్కరోజే 20,487 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా మరణాలు కూడా 181 వరకు నమోదయ్యాయి. దాంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 22,484కు చేరుకుంది. ప్రస్తుతం కేరళలో కరోనా యాక్టివ్ కేసులు 2,31,792 ఉన్నాయి. పాజిటివ్ రేటు 15.19శాతానికి పెరిగింది.

భారతదేశంలో శుక్రవారం 33,376 కొత్త కొవిడ్-19 కేసులు నమోదు కాగా.. 308 కరోనా మరణాలు నమోదయ్యాయి. గురువారం నాటికి కరోనా కేసుల సంఖ్య 34,973 కేసుల నుంచి స్వల్పంగా తగ్గాయి. వైరస్ బారిన పడిన వారి సంఖ్య 276 నుంచి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 3.91 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కొవిడ్-19 పరిస్థితి, వ్యాక్సినేషన్ డ్రైవ్ సమీక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
Rakesh Tikait : ఢిల్లీలో రికార్డు స్థాయిలో భారీవర్షం.. నడుము లోతు నీటిలో రైతుల నిరసన.. ఫొటోలు వైరల్!

కొన్ని ప్రాంతాల్లోని కరోనా కేసులపై ఆరా తీశారు. శుక్రవారం జరిగిన సమావేశంలో ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) అధిక టెస్టు పాజిటివిటీ ఉన్న జిల్లాలు, దేశంలో టెస్టుల పాజిటివిటీ రేటు రేటుతో నమోదైన కేసులకు సంబంధించి వివరాలను మోదీ సమీక్షించారు. మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనావైరస్ మహమ్మారి కారణంగా వరుసగా రెండవ ఏడాదిలోనూ గణేష్ చతుర్థి వేడుకలను ఆంక్షలతో నిర్వహించేందుకు అనుమతిచ్చింది.

ముంబైలో, నగర పోలీసులు సెప్టెంబర్ 10, 19 మధ్య నలుగురి కంటే ఎక్కువ మంది సమావేశాలు, ఊరేగింపులను నిషేధించారు. గణేష్ మండపాలను సందర్శించడానికి బదులుగా, భక్తులు వర్చువల్ దర్శనాలలో పాల్గొనాల్సిందిగా ఆదేశించారు. కరోనా యాక్టివ్ కేసులు ప్రస్తుతం మహారాష్ట్రలో 3.91 లక్షలకు పైగా ఉన్నాయి. కేరళ, మహారాష్ట్రలో కొవిడ్-19 కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
Rajasthan : పుట్టింటికి వెళ్తానన్న భార్య..ముక్కు కోసి పడేసిన భర్త

ట్రెండింగ్ వార్తలు