Covid-19 పేరుతో ముస్లింలను చంపేస్తున్నారంటోన్న ఎమ్మెల్యే అరెస్టు

అస్సాంలోని ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. మతాలకు సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తుండటంతో పోలీసులు అరెస్టు చేశారు. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక ఫ్రంట్ (AIUDF) పార్టీకి చెందిన అమీనుల్ ఇస్లాం అనే ఎమ్మెల్యే మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా అస్సాం డీజీపీ భాస్కర్ జ్యోతి మహంతా గుర్తించారు. అతను మాట్లాడిన ఆడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుండటంతో విషయం పోలీసుల వరకూ వచ్చింది. 

కొవిడ్ -19పేరుతో ముస్లింలను టార్గెట్ చేశారని, క్వారంటైన్ అని చెప్పి చంపేస్తున్నారని ఆడియో క్లిప్పులలో ఉందట. దీంతో నాగోవ్ జిల్లాలోని ధింగ్ ప్రాంతంలో ఇంట్లో ఉన్న ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ పూర్తి మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. మంగళవారం తర్వాత అతణ్ని కోర్టులో హాజరుపరచనున్నారు. అతనికి సంబంధించిన డిజిటల్ అకౌంట్లన్నింటీని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 

అతని మొబైల్లోనూ చాలా క్లిప్పింగులను పోలీసులు గుర్తించారు. వీటిపై డిజిటల్ గా టెస్టులు నిర్వహిస్తారు. కొద్ది రోజులుగా ఎమ్మెల్యే సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ ప్రభుత్వం కొవిడ్-19 పేషెంట్లతో ప్రవర్తిస్తున్న వైఖరిని ప్రశ్నిస్తున్నాడు. గత నెల ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ కూడా వెళ్లాడు. 

అస్సాంలో ప్రస్తుతం 26కరోనా పాజిటివ్ కేసులు ఉండగా, 25 జమాత్ కు సంబంధించినవే. తబ్లిగీ జమాత్ తర్వాత కరోనా కేసులు ఉన్నట్టుండి రెట్టింపు అయిపోయాయి. సోమవారం సాయంత్రానికి భారత్ లో 4వేల 67 కేసులు నమోదుకాగా, తబ్లిగీ జమాత్ కు సంబంధించినవి వెయ్యి 445ఉన్నాయి. 25వేల 500మంది పాల్గొన్న జమాత్ లో కేసులు ఇంకెన్ని బయటపడతాయో తేలాల్సి ఉంది. ( 5T Plan : కరోనా కట్టడికి కేజ్రీ మాస్టర్ ప్లాన్ )