2021 శీతాకాలం నాటికి.. కరోనా వైరస్ వల్ల అత్యంత దారుణంగా ప్రభావితమయ్యే దేశంగా భారత్ నిలుస్తుందని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు అంచనా వేశారు. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం… 2021 శీతాకాలానికి భారత్‌లో రోజుకు 2.87 లక్షల కేసులు నమోదవుతాయంట. అప్పటివరకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోతే.. కరోనా సంక్షోభంతో ప్రపంచంలోనే అత్యంత దారుణంగా ప్రభావితమయ్యే దేశంగా భారత్ నిలుస్తుందని తేల్చిచెప్పారు.
2021 శీతాకాలం వరకు వ్యాక్సిన్ లేదా మెరుగైన చికిత్స అందుబాటులోకి రాకపోతే.. ప్రపంచవ్యాప్తంగా 24.9కోట్ల కేసులు వెలుగుచూస్తాయన్నారు. 18లక్షలమంది మరణిస్తారని అంచనా వేశారు. సామాజిక దూరం యొక్క ప్రాముఖ్యతను ఈ స్టడీ పునరుద్ఘాటించింది.
భారత్ తర్వాత అమెరికాలో రోజుకు 95,400కేసులు దక్షిణాఫ్రికాలో 20,600కేసులు, ఇరాన్ లో 17,000కేసులు, ఇండోనేషియాలో 13,200కేసులు,బ్రిటన్ లో 4,200కేసులు ఉంటాయని అంచనా వేశారు. ఈ పరిశోధన కోసం ఎస్ఈఐఆర్(ససెప్టబుల్, ఎక్స్పోజ్డ్, ఇన్ఫెక్షియస్ రికవర్డ్) మోడల్‌ను వినియోగించారు. అంటు వ్యాధులకు ప్రామాణికంగా ఎపిడమాలజిస్ట్‌లు ఈ మోడల్‌ను ఉపయోగిస్తారు.