ఫార్మాసుటికల్ కంపెనీ ఎక్కడున్నా వాటి ప్రొడక్ట్స్ దేశం మొత్తం తిరుగుతుంటాయి. వాటి వల్ల ఏదైనా నష్టం జరిగితేనే కానీ తెలియదు ఎక్కడ తయారయ్యాయో.. ఇదే తరహాలో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ కంపెనీ మందులు 8రాష్ట్రాల్లో సర్కులేట్ అవుతున్నాయి. జమ్మూలో చిన్నారులకు గత నెలలో దగ్గు మందు కావాల్సి వచ్చింది.
అందులో పాయిజన్ కాంపౌండ్ కలిసిన సంగతి తెలియక 9మంది చిన్నారులకు తాగారు. దగ్గు మందు వేసుకుంటే జబ్బు ముదిరి నెల రోజులుగా పోరాడి ప్రాణాలు వదిలారు. ‘ప్రైమా ఫేసీ, డై ఇథిలీన్ గ్లైకాల్ అనే రెండు విష పదార్థాలు కోల్డ్ బెస్ట్ పీసీ టానిక్‌లో కలిశాయి. వీటి కారణంగానే ఉదంపూర్ జిల్లా, ఛండీఘర్‌లోని చిన్నారులు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని’ డ్రగ్ అండ్ ఫుడ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ డ్రగ్స్ కంట్రోలర్ వెల్లడించారు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్‌లో శాంపుల్స్ టెస్ట్ చేయించామని.. ఇంకొన్ని పరీక్షలు జరుగుతున్నాయన్నారు. ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తాం. ఆ దగ్గు మందును ఇప్పటికే ఆపేశాం. ఆ మందు తాగడం కారణంగా ఊపిరితిత్తులు చెడిపోయాయి’ అని డైరక్టర్ హెల్త్ సర్వీస్‌కు చెందిన డా.రేణు శర్మ తెలిపారు.
ఈ దగ్గు మందు తాగడం వల్ల మొత్తం 17మంది చిన్నారులకు అనారోగ్యం వచ్చింది. 9మంది ప్రాణాలు కోల్పోయారు. తర్వాత సోదాలు జరిపి 8రాష్ట్రాల్లో ఉన్న 5వేల 500దగ్గు మందు బాటిళ్లను సీజ్ చేశారు. ఇది తయారీ అయిన యూనిట్‌ను కూడా క్లోజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఆ కంపెనీ వార్షిక ఆధాయం రూ.45కోట్లు.
‘సెప్టెంబరు 2019లో తయారైన ఈ మందులో పాయిజన్ కాంపౌండ్ ఉంది. ముందు జాగ్రత్త కోసం ఫిబ్రవరి 17నుంచి ఫ్యాక్టరీ పనులను ఆపేశాం. ఇక్కడి నుంచి ఎవరికి సరఫరా చేశారో.. అక్కడి నుంచి కొనుగోలు చేసిన వినియోగదారులను సంప్రదించి వైద్య సహాయం అందిస్తున్నాం. ఉత్తరాఖాండ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, తిరుచిరాపల్లి(తమిళనాడు), షిల్లాంగ్(మేఘాలయ), త్రిపురలో తనిఖీలు చేపడుతున్నాం’ అని హిమాచల్ ప్రదేశ్ ఉన్నతాధికారులు వివరించారు.