లాయర్ల డ్రెస్ కోడ్ మారనుంది.. ఇక తెలుపే తెలుపు?

  • Publish Date - May 13, 2020 / 01:49 PM IST

జడ్జిలు, లాయర్లు నల్ల కోట్లు, నల్ల గౌన్లకు గుడ్ బాయ్ చెప్పాల్సిన సమయం వచ్చింది. కనీసం కరోనావైరస్ ఉన్నంత కాలమైనా ఇది తప్పదని తీర్మానించారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్ఏ బాబ్డేను ప్రజా ప్రయోజన వ్యాజ్యం మేరకు సమావేశమయ్యారు. 

‘Coronavirus (COVID-19) వ్యాప్తి చెందకుండా ముందుస్తు జాగ్రత్త చర్యగా నియమాలను పాటించాలని చెప్పారు. ఇన్ఫెక్షన్ సోకకుండా అడ్వకేట్లు నల్లకోట్లు ధరించడం మానేయాలని సూచించింది’ వాటి స్థానంలో వైట్ షర్టులు/వైట్ సల్వార్-కమీజ్, వైట్ శారీలతో పాటు వైట్ నెక్ బ్యాండ్ ధరించాలని తీర్మానించారు. సుప్రీం కోర్టు వర్చువల్ కోర్ట్ సిస్టమ్ ద్వారా ముందస్తు ఆర్డర్లు వచ్చే వరకూ వెయిట్ చేయాలని’ సూచించారు. 

మంగళవారం మరో కేసు విచారణ సందర్బంగా సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సందేహాన్ని నివృత్తి చేస్తూ, వచ్చేవారం నుంచి కోర్టులోనే విచారణలు చేపడతామని, అయితే న్యాయవాదులు మాత్రం చాంబర్ నుంచి వాదనలు వినిపించాలని న్యాయమూర్తి నాగేశ్వరరావు చెప్పారు.  దీనిని ఆయన ఓ పైలట్ ప్రాజెక్టుగా అభివర్ణించడం విశేషం.

సమ్మర్ వెకేషన్ మేరకు టాప్ కోర్టు షెడ్యూల్‌ను మే18 నుంచి జులై 6వరకూ ఉంటుందని చెప్పారు. దీనిని బట్టి సమ్మర్ వెకేషన్ ఉండబోదని తెలుస్తుంది. అధికారికంగా క్యాన్సిలేషన్ గురించి నోటిఫికేషన్ ఏదీ వెలువడలేదు. టాప్ కోర్ట్ ప్రస్తుతం 32మంది జడ్జిలతో నిర్వహిస్తుండగా 34 మంది పరిమితి ఉంది. సాధారణంగా ఇద్దరు లేదా ముగ్గురు కలిసి బెంచ్ పై కూర్చుంటారు.