Counterfeit Currency : దేశంలో భారీగా పెరిగిన నకిలీనోట్ల చలామణీ..ఆరేళ్ల తర్వాతా ఫలితాన్నివ్వని డీమానిటైజేషన్

ఏటికేడు ఈ నకిలీ నోట్ల బెడద అంతకంతకూ పెరుగుతోంది. అంతగా కనిపించకుండా పోయిన 2వేల రూపాయల పెద్దనోట్లే కాదు...ప్రజలు విస్తృతంగా ఉపయోగిస్తున్న 500 రూపాయల నోట్లలో కూడా పెద్ద ఎత్తున నకిలీవి ఉంటున్నాయి.

Fake Notes

Counterfeit currency : 2016లో రాత్రికి రాత్రి పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటిస్తూ ప్రధాని మోదీ చెప్పిన మాట…దేశంలో నకిలీ నోట్లకు అడ్డుకట్టవేయడం, బ్లాక్‌ మనీని వెలికి తీయడం, అవినీతి అంతం చేయడమే లక్ష్యమని. మరి డీమానిటైజేషన్ జరిగిన ఆరేళ్ల తర్వాతయినా అనుకున్న లక్ష్యం నెరవేరిందా..? దేశంలో నకిలీ నోట్ల చలామణీ ఆగిందా…? మన చేతికొచ్చేనోట్లన్నీ ఆర్‌బీఐ అధికారికంగా ముద్రించినవేనా..?అంటే వచ్చే సమాధానం కానే కాదని. పెద్ద నోట్ల రద్దు అసలు ఉద్దేశం నెరవేరకపోగా..మరింతగా నకిలీ నోట్లు దేశంలో చేతులు మారుతున్నా యి.

ఏటికేడు ఈ నకిలీ నోట్ల బెడద అంతకంతకూ పెరుగుతోంది. అంతగా కనిపించకుండా పోయిన 2వేల రూపాయల పెద్దనోట్లే కాదు…ప్రజలు విస్తృతంగా ఉపయోగిస్తున్న 500 రూపాయల నోట్లలో కూడా పెద్ద ఎత్తున నకిలీవి ఉంటున్నాయి. ఇవి ప్రతిపక్షాలో, ప్రభుత్వ వ్యతిరేకులో చేసిన ఆరోపణలు, విమర్శలు కాదు. స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కలతో సహా వెల్లడించిన వివరాలు. ఇవే ఇప్పుడు ప్రతిపక్షాలకు ప్రధాన అస్త్రంగా మారాయి.

Fake Currency: దడ పుట్టిస్తున్న నకిలీ నోట్ల చలామణి: రూ.500 నోట్లలో 100 శాతం పెరిగాయన్న ఆర్బీఐ

ఆర్‌బీఐ నివేదిక ప్రకారం అన్ని రకాల నకిలీ నోట్లు పెరిగాయి. 500 రూపాయల నకిలీ నోట్లు ముందు ఏడాదితో పోలిస్తే 2021-22 ఆర్థిక సంవత్సరంలో 101.9శాతం పెరిగాయని, రెండువేల రూపాయల నకిలీ నోట్లు 55శాతం పెరిగాయని ఆర్‌బీఐ తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశంలో నకిలీనోట్ల చలామణి బాగా తగ్గింది. ఏడాది కాలంలో మళ్లీ ఫేక్ నోట్లు ఇంత విస్తృతంగా ఎలా వాడకంలోకి వచ్చాయన్నది అర్ధం కావడం లేదు. 6.9శాతం నకిలీనోట్లను ఆర్‌బీఐ గుర్తించగా, 93.1శాతం నోట్లను ఇతర బ్యాంకులు గుర్తించాయి.

డీమానిటైజేషన్ జరిగిన తర్వాత నుంచి నకిలీనోట్ల చలామణీ పెరుగుతూనే ఉంది. 2017-18లో 500 రూపాయల నకిలీ నోట్లు 9వేల892 ఉండగా, 2000 రూపాయల నోట్లు 17వేల 29 ఉండేది. 2021-22 నాటికి 500 రూపాయల నకిలీ నోట్లు 79వేల669 చలామణీ అవుతున్నాయి. రెండు వేల రూపాయల నోట్లు 13వేల604 నోట్లు చలామనీ అవుతన్నాయి. 500 నకిలీది కాదని గుర్తించాలంటే లైట్ షేడ్ పడినప్పుడు…నోటుపై కొన్ని చోట్ల 500 అని రాసిఉంటుంది. అలాగే నోటుపై దేవనాగరలిపిలో 500 అని రాసి ఉంటుంది.

Fake currency : రోడ్డుపై గుట్టలుగా రూ.2వేల నోట్ల కట్టలు.. ఎగబడిన జనం..

మహాత్మాగాంధీ పొటో కుడివైపు ఉంటుంది. నోటుపై ఇండియా అని రాసి ఉంటుంది. నోటును వంచినప్పడు రంగు ఆకుపచ్చ నుంచి ఇండిగోకు మారుతుంది. గవర్నర్ సంతకం, గ్యారంటీ, ప్రామిస్ క్లాజ్, ఆర్‌బీఐ చిహ్నం కరెన్సీ నోటు కుడివైపు ఉంటాయి. ఎలక్ట్రోటైప్ వాటర్ మార్క్ ఉంటుంది. 500 అని రాసి ఉన్న రంగు ఆకుపచ్చ నుంచి బ్లూకు మారుతుంది. అశోకస్తంభం కరెన్సీ నోటు కుడివైఉ ఉంటుంది. స్వచ్ఛ భారత్ లోగో, నినాదం రాసి ఉంటాయి.

అటు నకిలీ నోట్ల చలామణిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో విరుచుకుపడ్డారు. డీమానిటైజేషన్‌తో కేంద్ర ప్రభుత్వం సాధించిన దురదృష్టకరమైన విజయం…ఆర్థిక వ్యవస్థను తిరోగమనం పట్టించడమే అని రాహుల్ ట్వీట్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ కూడా కేంద్రప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించింది. నమస్కారం మిస్టర్ పిఎం మోదీ. డీమానిటైజేషన్ గుర్తుందా…? నకిలీ నోట్లను దేశం నుంచి తొలగించివేస్తామనన్న వాగ్ధానం గుర్తుందా అని తృణమూల్ నేత డెరెక్ ఓ బ్రెయిన్ ట్వీట్ చేశారు. డీమానిటైజేషన్ లాభాల్లో ఒకటి దక్కింది అని సెటైరికల్‌గా స్పందించారు.