Fake Currency: దడ పుట్టిస్తున్న నకిలీ నోట్ల చలామణి: రూ.500 నోట్లలో 100 శాతం పెరిగాయన్న ఆర్బీఐ

అన్ని నోట్లలోదొంగ నోట్లు ముద్రణ ఎక్కువగానే ఉండగా నకిలీ రూ .500 నోటు ముద్రణలో వంద శాతం పెరుగుదల కనిపిస్తున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది.

Fake Currency: దడ పుట్టిస్తున్న నకిలీ నోట్ల చలామణి: రూ.500 నోట్లలో 100 శాతం పెరిగాయన్న ఆర్బీఐ
ad

Fake Currency: దేశంలో దొంగ నోట్ల చలామణీ విపరీతంగా పెరిగిపోతుంది. అడ్డుఅదుపులేని నకిలీ నోట్ల ముద్రణతో ప్రజలు, ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. భారతీయ రిజర్వు బ్యాంకు ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరంలో అన్ని డినామినేషన్లలో నకిలీ నోట్ల చలామణి పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. అన్ని నోట్లలోదొంగ నోట్లు ముద్రణ ఎక్కువగానే ఉండగా నకిలీ రూ .500 నోటు ముద్రణలో వంద శాతం పెరుగుదల కనిపిస్తున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే రూ.500 డినామినేషన్ కలిగిన నకిలీ రూ.500 నోట్లలో 101.9 శాతం, రూ.2,000 నకిలీ నోట్లలో 54.16 శాతం పెరుగుదలను ఆర్బీఐ గుర్తించింది.

other stories: Gold Reserve: బంగారం తవ్వకాలకు బిహార్ అనుమతి

దీంతో ఈ ఏడాది మార్చి చివరి నాటికి చలామణిలో ఉన్న రూ.500 డినామినేషన్ నోట్ల సంఖ్య 4,554.68 కోట్లకు పెరిగింది. అసలు నోట్ల చలామణి సర్క్యూలేషన్ పరిణామం ప్రకారం చూస్తే, అన్ని డినామినేషన్(నోట్ల విలువ)లలో రూ .500 డినామినేషన్ 34.9 శాతం వద్ద అత్యధిక సర్క్యూలేషన్ వాటాను కలిగి ఉంది. తరువాత రూ .10 డినామినేషన్ నోట్లు ఉన్నాయి. ఇది మార్చి 31, 2022 నాటికి చలామణిలో ఉన్న మొత్తం బ్యాంకు నోట్లలో 21.3 శాతం అని 2021-22 వార్షిక నివేదికలో ఆర్బీఐ పేర్కొంది. 2021 మార్చి చివరి నాటికి రూ.500 డినామినేషన్ నోట్లు 31.1 శాతం, మార్చి 2020 నాటికి 25.4 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

other stories: PM Modi: ద్రవ యూరియా ప్లాంట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ: పరిశ్రమలో ఎన్నో ప్రత్యేకతలు

విలువ పరంగా, ఈ నోట్లు మార్చి 2020 నుండి మార్చి 2022 వరకు 60.8 శాతం నుండి 73.3 శాతానికి పెరిగాయి. అదే సమయంలో సర్క్యూలేషన్ లో రూ.2000 నోట్ల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. రూ.2000 డినామినేషన్ కలిగిన బ్యాంకు నోట్ల సంఖ్య గత కొన్నేళ్లుగా క్రమంగా క్షీణించి ఈ ఏడాది మార్చి చివరి నాటికి 214 కోట్లకు చేరింది. ఇది చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో 1.6 శాతం, అంతక్రితం 2020 మార్చి చివరి నాటికి, చెలామణిలో ఉన్న రూ .2000 డినామినేషన్ నోట్ల సంఖ్య 274 కోట్లుగా ఉండేది.