Gold Reserve: బంగారం తవ్వకాలకు బిహార్ అనుమతి

రాష్ట్రంలో బంగారం తవ్వకాలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది బిహార్ ప్రభుత్వం. దీని ప్రకారం దేశంలోనే అతిపెద్ద బంగారు నిల్వలున్న ప్రదేశంగా భావిస్తున్న జముయ్ జిల్లాలో తవ్వకాలు జరుగుతాయి.

Gold Reserve: బంగారం తవ్వకాలకు బిహార్ అనుమతి

Gold Reserve

Gold Reserve: రాష్ట్రంలో బంగారం తవ్వకాలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది బిహార్ ప్రభుత్వం. దీని ప్రకారం దేశంలోనే అతిపెద్ద బంగారు నిల్వలున్న ప్రదేశంగా భావిస్తున్న జముయ్ జిల్లాలో తవ్వకాలు జరుగుతాయి. జముయ్ జిల్లాలో దేశంలోనే అత్యధిక బంగారు నిల్వలున్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) తేల్చింది. ఈ ప్రాంతంలో దాదాపు 222.88 మిలియన్ టన్నుల బంగారు నిల్వలు ఉంటాయని జీఎస్ఐ అంచనా. దీంతోపాటు 37.6 టన్నుల ఇతర ఖనిజ నిల్వలు ఉన్నాయని అంచనా వేసింది. తాజాగా బిహార్ మైన్స్ అండ్ జియాలజీ శాఖ ఆధ్వర్యంలో బంగారం తవ్వే సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు బిహార్ ప్రభుత్వం తెలిపింది.

Nandamuri Balakrishna: టీడీపీతోనే భవిష్యత్తు: నందమూరి బాలకృష్ణ

అనేక సంస్థలతో ప్రాథమిక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటుంన్నట్లు ప్రభుత్వం చెప్పింది. జీఎస్ఐ, ఎన్ఎమ్‌డీసీతో కూడా చర్చిస్తున్నట్లు తెలిపింది. జీఎస్ఐ అంచనా ప్రకారం జముయ్ జిల్లాలోని కర్మాటియా, ఝాఝా, సోనో ప్రాంతంలో బంగారు నిల్వలున్నాయి. జీఎస్ఐ అంచనాలకు తగ్గట్లు బంగారం లభిస్తే.. అది ప్రస్తుతం దేశంలో ఉన్న బంగారు నిల్వల్లో 44 శాతంతో సమానం. 2015నాటి అంచనా ప్రకారం దేశంలో 501.83 మిలియన్ టన్నుల ముడి బంగారు నిల్వలు ఉన్నాయి.