PM Modi: ద్రవ యూరియా ప్లాంట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ: పరిశ్రమలో ఎన్నో ప్రత్యేకతలు

ఇఫ్కో(IFFCO) ఆధ్వర్యంలో గుజరాత్ లోని కలోల్ లో ఏర్పాటు చేసిన ప్రపంచంలోని మొట్టమొదటి నానో యూరియా లిక్విడ్ ప్లాంట్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.

PM Modi: ద్రవ యూరియా ప్లాంట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ: పరిశ్రమలో ఎన్నో ప్రత్యేకతలు

Liquid Urea

PM Modi: ప్రపంచంలోనే మొట్టమొదటి ద్రవ యూరియా తయారీ ప్లాంట్ ను భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఇఫ్కో(IFFCO) ఆధ్వర్యంలో గుజరాత్ లోని కలోల్ లో ఏర్పాటు చేసిన ప్రపంచంలోని మొట్టమొదటి నానో యూరియా లిక్విడ్ ప్లాంట్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. గుజరాత్ లోని గాంధీనగర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తదితరులు పాల్గొన్నారు. బెంగళూరు, పరాదీప్, కాండ్లా, దేవగఢ్ మరియు గౌహతిలలో నానో ఫెర్టిలైజర్స్ ఉత్పత్తి కోసం అదనపు తయారీ సౌకర్యాలను ఏర్పాటు చేసింది ఇఫ్కో. ఈ యూనిట్లన్నింటికీ రోజుకు 2 లక్షల బాటిళ్ల డిజైన్ ఉత్పత్తి సామర్థ్యం ఉంటుంది.

other stories: PM Modi: భారతీయులు సిగ్గుతో తలలు వంచుకునేలా ఎలాంటి పని చేయలేదు: ప్రధాని మోదీ

మొత్తం రూ .3,000 కోట్ల పెట్టుబడి వ్యయంతో ఇప్పటికే రూ .720 కోట్లు ఖర్చు చేయగా ఈపరిశ్రమలు వేలాది మందికి ఉపాధిని కల్పించనున్నాయి. ద్రవ రూప నానో యూరియా ఉపయోగించడం ద్వారా పంట యొక్క పోషక నాణ్యత మరియు ఉత్పాదకతను పెంచడంలో చాలా ప్రభావవంతంగా ఉందని, భూగర్భ నీరు మరియు పర్యావరణం యొక్క నాణ్యతపై భారీ సానుకూల ప్రభావాన్ని చూపుతుందని, తద్వారా గ్లోబల్ వార్మింగ్ గణనీయంగా తగ్గుతుందని ఇఫ్కో ఎండి యు.ఎస్ అవస్థి చెప్పారు.

other stories: Indigo Airlines fined: ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు రూ.5 లక్షలు జరిమానా విధించిన డీజీసీఏ

3.60 కోట్ల ఇఫ్కో నానో యూరియా లిక్విడ్ బాటిళ్లు ఉత్పత్తి అయ్యాయని, అందులో 2.50 కోట్ల బాటిళ్లు ఇప్పటికే అమ్ముడుపోయాయని ఆయన తెలిపారు. ద్రవ రూప యూరియా తయారీ ఆలోచన ప్రధాని మోదీ మాటల నుంచి ప్రేరణ పొందినట్లు అవస్థి తెలిపారు. మట్టిలో యూరియా వాడకాన్ని తగ్గించాలనే ప్రధాన మంత్రి దార్శనికత నుండి తీసుకున్నామని, ఆధునిక వ్యవసాయ పద్ధతులు ప్రవేశపెట్టనున్న తరుణంలో నానో యూరియా వాహకాలుగా డ్రోన్లు పనిచేస్తాయని యు.ఎస్ అవస్థి అన్నారు.