Covaxin Efficacy Rate : కోవాగ్జిన్ టీకా సమర్థత 77.8%

డ్ నియంత్రణ కొరకు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ టీకా 77.8 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు 'ద లాన్సెట్' పత్రిక తన కథనంలో తెలిపింది.

Covaxin Efficacy Rate :  కోవిడ్ నియంత్రణ కొరకు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ టీకా 77.8 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు ‘ద లాన్సెట్’ పత్రిక తన కథనంలో తెలిపింది. ప్రాథమిక విశ్లేషణలో కరోనా వైరస్‌లో అత్యంత ప్రమాదకరమైన డెల్టా వేరియంట్‌ 65.2 శాతం ప్రభావవంతంగా ఎదురుకుంటుందని పేర్కొన్నారు. 2020 నవంబర్ నుంచి 2021 మే వరకు కోవాగ్జిన్ స‌మ‌ర్థ‌త‌పై 18 ఏళ్ల నుంచి 97 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న 24,419 మందిపై అధ్య‌య‌నం చేప‌ట్టిన‌ట్లు మెడిక‌ల్ జ‌ర్న‌ల్ త‌న రిపోర్ట్‌లో పేర్కొన్న‌ది.

చదవండి : Covaxin: ఇండియన్ ట్రావెలర్స్‌కి గుడ్ న్యూస్.. బ్రిటన్‌లో కొవాగ్జిన్‌కి ఆమోదం

కాగా భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో ఈ స్టడీ జరిగింది. నిర్జీవ వైరస్‌తో తయారు చేసిన ఈ వ్యాక్సిన్ దండిగా యాంటీబాడీల ఉత్పత్తి చేస్తున్నట్లు తేల్చారు. సాంప్రదాయ పద్దతిలో తయారు చేసిన ఈ వ్యాక్సిన్ రెండు డోసులు ఇచ్చిన రెండు వారాల తర్వాత దండిగా యాంటీబాడీలను ఉత్పత్తి అవుతున్నాయని లాన్సెట్ ప్రకటనలో తెలిపింది.

చదవండి : Covaxin: ఇండియన్స్‌‌కి గుడ్ న్యూస్.. భారత్ బయోటెక్ కొవాగ్జిన్‌కు WHO అనుమతి

ట్రెండింగ్ వార్తలు