Covaxin: ఇండియన్ ట్రావెలర్స్‌కి గుడ్ న్యూస్.. బ్రిటన్‌లో కొవాగ్జిన్‌కి ఆమోదం

భారత్‌లో కరోనా కంట్రోల్‌ చేయడంలో కీలకంగా వ్యవహరించిన కొవాగ్జిన్‌ను బ్రిట‌న్ అత్యవసర వినియోగం కోసం ఆమోదించింది.

Covaxin: ఇండియన్ ట్రావెలర్స్‌కి గుడ్ న్యూస్.. బ్రిటన్‌లో కొవాగ్జిన్‌కి ఆమోదం

Covaxin Clearance

Covaxin In Britain Approved List: భారత్‌లో కరోనా కంట్రోల్‌ చేయడంలో కీలకంగా వ్యవహరించిన కొవాగ్జిన్‌ను బ్రిట‌న్ అత్యవసర వినియోగం కోసం ఆమోదించింది. యూకే అనుమ‌తి కోసం భార‌త్ బ‌యోటెక్ ఎన్నోరోజులుగా ఎదురుచూస్తోండగా.. కొవాగ్జిన్‌ను అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో వాడేందుకు అనుమ‌తి ఇస్తూ ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ(WHO) ఆదేశాలు జారీ చేసిన తర్వాత బ్రిటన్ కూడా ఈమేరకు నిర్ణయం తీసుకుంది.

కొవాగ్జిన్‌కు అనుమ‌తిపై ద‌శ‌లవారీగా నిర్ణ‌యం తీసుకుంటామ‌ని భార‌త్‌లో బ్రిట‌న్ హైక‌మిష‌న్ ప్రకటించిన రెండు రోజులకే అత్యవసర అనుమతి లభించింది. ప్ర‌స్తుతానికి ఫైజ‌ర్ బ‌యోటెక్‌, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా/కొవిషీల్డ్‌, జాన్‌స్సెన్ త‌దిత‌ర వ్యాక్సిన్ల‌ను బ్రిటన్ ఆమోదించింది. ఈ క్రమంలోనే బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మన దేశంలో ‘కోవాగ్జిన్’ సింగిల్ డోసు తీసుకున్న వారికి కూడా ఇది శుభవార్త. వారు ఇప్పుడు ఎటువంటి అవాంతరాలు లేకుండా UKకి ప్రయాణించగలరు. అక్కడ రెండో డోసు వేసుకునే అవకాశం కూడా ఉంటుంది. నవంబర్ 22వ తేదీ నుంచి బ్రిటన్ ఈ వ్యాక్సిన్‌ దేశంలో అందుబాటులోకి రానుంది.