Covid-19 Cases : దేశంలో కొత్తగా 2,124 కరోనా కేసులు, 17 మరణాలు

Covid-19 Cases : భారత్‌లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకీ కరోనా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి.

Covid-19 Cases : భారత్‌లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకీ కరోనా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. దేశవ్యాప్తంగా మొన్న 1675 కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో (మంగళవారం) 2,124 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 17 మంది మరణించారు. కరోనా నుంచి కోలుకున్న 1977 మంది ఆస్పత్రుల నుంచి ఒక్కరోజే డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా నుంచి కోలుకున్నవారి శాతం 98.75గా ఉందని వెల్లడించింది. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 0.46గా నమోదైంది. ప్రస్తుతం దేశంలో 14.971 యాక్టవ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో 0.03 శాతంగా ఉన్న కొవిడ్ యాక్టివ్ కేసులు, ఇప్పటివరకూ 4,31,42,192 కేసులు నమోదయ్యాయి.

అలాగే కరోనా మరణాలు 5,24,507 వరకు నమోదయ్యాయి. దేశంలో 98.75 శాతంగా కరోనా రికవరీ రేటు నమోదైంది. దేశంలో మంగళవారం కరోనా నుంచి 1977 మంది కోలుకున్నారు. ఇదిలా ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజే 6,21,079 మందికిపైగా కరోనా బారినపడ్డారు. మరో 1,464 మంది మరణించారు. దాంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 52,87,80,120కు చేరింది. ఇక కరోనా మరణాల సంఖ్య 63,03,425కు చేరింది. ఒక్కరోజే 7,57,202 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 49,91,65,389గా చేరింది.

Covid 19 Cases India Logs 2,124 New Covid 19 Cases In Last 24 Hours, Up 26.8% From Yesterday (1)

మరోవైపు.. భారత్‌లో 494 రోజులుగా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 192.67 కోట్ల డోసుల టీకాలను అందజేశారు. మరో 13,27,544 డోసుల టీకాలను అందించారు. ఇప్పటివరకు 192,67,44,769 డోసుల టీకాలను అందించారు. భారత్‌లో 84.79 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో 4,58,924 టెస్టులు చేయగా.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 84,79,58,776 టెస్టులు నిర్వహించారు. 3378 లాబ్స్‌లో కరోనా నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. కరోనా టెస్టుల కోసం దేశవ్యాప్తంగా ప్రజలకు 1433 ప్రభుత్వ లాబ్స్,1945 ప్రైవేట్ లాబ్స్ అందుబాటులో ఉన్నాయి.

Read Also :  COVID Cases In India: దేశంలో తగ్గిన కరోనా కేసులు

ట్రెండింగ్ వార్తలు