Covid 19 Cases May Peak By May 1st Week In The State
Covid-19 cases May 1st week : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. రాబోయే రోజుల్లో కరోనా పరిస్థితులు భయానకంగా మారనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, అందరూ ఊహించినట్టుగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఉండబోదని, మే మొదటివారంలోనే కరోనా తగ్గుముఖం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ మనింద్ర అగర్వాల్, ఆయన బృందం చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలింది.
దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి పీక్ స్టేజ్‌లో ఉంది. ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. మే మొదటి వారంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో కరోనా వ్యాప్తి అత్యధికంగా ఉంది. మే మొదటి వారం నుంచి కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. జూన్ నాటికి ఇలాంటి పరిస్థితుల నుంచి ఉపశమనం లభించనుందని అధ్యయనంలో తేలింది.
రాబోయే రోజుల్లో ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంటోంది. ఉత్తరప్రదేశ్‌లోనూ ఇలాంటి పరిస్థితులే ఉండనున్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల కారణంగా కరోనా కేసులు పెరిగాయని అంటున్నారు. అయినప్పటికీ రాబోయే రోజుల్లో బెంగాల్ లోనూ కరోనా కేసుల సంఖ్య తగ్గుతుందని భావిస్తున్నారు.