India Covid UPdate : భారత్‌లో నిన్న కొత్తగా 1,27,952 కోవిడ్ కేసులు నమోదు

భారత్‌‌లో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,27.952 కోవిడ్ కేసులు నమోదయ్యయాయి. మొన్న 1,49,394 కేసులు నమోదు కాగా  నిన్న  దాదాపు  22 వేల కేసులు

India Covid update

India Covid UPdate :  భారత్‌‌లో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,27.952 కోవిడ్ కేసులు నమోదయ్యయాయి. మొన్న 1,49,394 కేసులు నమోదు కాగా  నిన్న  దాదాపు  22 వేల కేసులు తగ్గాయి.  నిన్నకొవిడ్ తదితర కారణాలతో 1,059 మంది మరణించారు.

దేశంలో ప్రస్తుతం 13,31,648 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  దేశంలో ఇప్పటివరకు 4,20,80,664మందికి కోవిడ్ సోకగా వారిలో 5,01,114 కోవిడ్ తదితర కారణాలతో మరణించినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఈరోజు విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది.

దేశంలో రోజువారి పాజిటివిటీరేటు 7.98 శాతానికి చేరుకుంది. కరోన రికవరీ రేటు 95.64 శాతంగా ఉంది. నిన్న కోవిడ్ నుంచి 2,30,814 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోవిడ్ నుంచి నుంచి కోలుకున్నవారిసంఖ్య 4,02,47,902కి చేరుకుంది.

భారత్ లో ఇంతవరకు 73,79,32,233 మందికి కరోన నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. నిన్న ఒక్కరోజే 16,03,856 మందికి పరీక్షలు నిర్వహించారు. కరోనా టెస్టుల కోసం దేశవ్యాప్తంగా 1,411 ప్రభుత్వ లాబ్స్,1,844 ప్రైవేట్ లాబ్స్ ప్రజలకు అందుబాటులో ఉన్నాయని కేంద్రం తెలిపింది.

Also Read : Love Affair : ప్రేమించాడని యువకుడిని చితకబాదిన యువతి కుటుంబ సభ్యులు

మరోవైపు కోవిడ్‌ను ఎదుర్కోనేందుకు గత 386 రోజులుగా  దేశంలో  కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 168,98,17,199 మందికి టీకాలు అందజేశారు. నిన్న 47,53,081 మంది కరోనా వ్యాక్సిన్ వేశారు.