Covid-19 India Update : కరోనా నుంచి కోలుకుంటున్న రాష్ట్రాలు, 14 రాష్ట్రాల్లో 90 శాతం రికవరీ

కరోనా నుంచి రాష్ట్రాలు క్రమంగా కోలుకుంటున్నాయి. రోజు రోజుకు రికవరీ రేటు పెరుగుతోంది. తెలంగాణ సహా 14 రాష్ట్రాల్లో 90 శాతంపైగా రికవరీ రేటు ఉంది. వైరస్‌ బారినపడిన వంద మందిలో 90 మందికిపైగా కోలుకోవడం మంచి పరిణామంగా భావిస్తున్నారు. ఇది కొద్దిగా ఊరట కలిగించే అంశం. రికవరీ రేటు పెరగడంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య తగ్గుతోంది.

India Covid 19

Recovery Rate Of States : కరోనా నుంచి రాష్ట్రాలు క్రమంగా కోలుకుంటున్నాయి. రోజు రోజుకు రికవరీ రేటు పెరుగుతోంది. తెలంగాణ సహా 14 రాష్ట్రాల్లో 90 శాతంపైగా రికవరీ రేటు ఉంది. వైరస్‌ బారినపడిన వంద మందిలో 90 మందికిపైగా కోలుకోవడం మంచి పరిణామంగా భావిస్తున్నారు. ఇది కొద్దిగా ఊరట కలిగించే అంశం. రికవరీ రేటు పెరగడంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య తగ్గుతోంది. మన దేశంలో గత నెలల్లో 37 లక్షల యాక్టివ్‌ కేసులు ఉంటే.. ప్రస్తుతం 26 లక్షలకు తగ్గింది. వైరస్‌ ఉధృతితో వణికిపోయిన ఢిల్లీ.. రికరీరేటులో మొదటి స్థానంలో ఉంది. హస్తినలో కరోనా బారిన పడినవారిలో 97 శాతం మంది కోలుకుంటున్నారు. తెలంగాణలో ఇది 93 శాతంగా ఉంది.

కరోనా రికవరీ రేటులో ఉత్తర్‌ప్రదేశ్‌, బీహార్‌, హర్యానా రెండో స్థానంలో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 94 శాతం రికవరీ రేటు నమోదైంది. తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లో 93 శాతం రికవరీ రేటు రికార్డైంది. ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ట్రీట్‌మెంట్‌ విధానం అమలుతోనే ఇది సాధ్యమైనట్లు గుర్తించారు. ఇక ఉత్తరాఖండ్‌లో మాత్రం కోవిడ్‌ పరిస్థితి ఇంకా భయంకరంగానే ఉంది. ఆ రాష్ట్రలో 80.7 శాతం మాత్రమే రికవరీ రేటు ఉంది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా ఇంకా డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, నాగాలాండ్‌, మేఘాలయ, సిక్కింలో రికవరీ రేటు 70 నుంచి 76 శాతం మాత్రమే నమోదవుతోంది.

కొన్ని రాష్ట్రాల్లో కరోనా రికవరీ రేటు జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది. జాతీయ సగటు 89 శాతం ఉంటే.. కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరి, జమ్ము-కశ్మీర్‌, మణిపూర్‌, ఒడిశా, అసోంలో 80 నుంచి 84 శాతం రికరీరేటు ఉంది. ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న కట్టడి చర్యలతో రోజువారీ నమోదువుతున్న కేసుల సంఖ్య తగ్గుతున్నా.. రికవరీ రేటు జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది.

Read More : Etela Rajender : బీజేపీలోకి రావాలంటూ ఈటలకు ఆహ్వానం