భారత్‌లో సగం వైరస్ ఫ్రీ…ఒక్క కరోనా కేసు కూడా లేదు

దాదాపు సగం భారత్ కరోనా వైరస్ ఫ్రీగా నిలిచింది. భారత్ లోని చాలా జిల్లాల్లో కరోనా కేసులు నమోదుకాలేదు. ఏప్రిల్-19,2020నాటికి దేశంలోని మొత్తం 736జిల్లాల్లోని 325జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదు.

దాదాపు 46శాతం కరోనా కేసులు కేవలం 18జిల్లాల్లోనే నమోదయ్యయి. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నుంచి కొన్ని రంగాలకు నేటి నుంచి మినహాయింపులు ఉన్న సమయంలో కంటైన్మెంట్ టాస్క్ ను ప్రభుత్వాలకు ఇది ఈజీ చేస్తుందని చెప్పవచ్చు.

రాష్ట్రాల మొత్తం కేసుల్లో 50శాతంపైగా కేసులు ముంబై(మహారాష్ట్ర),ఇండోర్(మధ్యప్రదేశ్),కోర్బా(ఛత్తీస్ ఘడ్),రాంచీ(జార్ఖండ్),హైదరాబాద్(తెలంగాణ),కుర్దా(ఒడిషా)ల్లోనే నమోదయ్యాయి. 

ఢిల్లీ,తమిళనాడు తప్ప అన్ని రాష్ట్రాల్లో తీవ్రంగా ప్రభావితమైన జిల్లాల్లో1/4వంతు కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలోనే అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 4,200కి చేరుకుంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 17వేలు దాటిపోయింది.