Covid Antibodies 88% Adults
COVID Antibodies : దేశవ్యాప్తంగా కరోనావైరస్ అన్ని రాష్ట్రాల్లోనూ వ్యాపించింది. రోజువారీ కరోనా కేసులతో పలు ప్రాంతాలు అల్లాడిపోయాయి. గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసుల తీవ్రత క్రమంగా తగ్గుతోంది. కరోనా మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి. కొవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలు ఆంక్షలను ఒక్కొక్కటిగా ఎత్తేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో దేశంలో ఇప్పటివరకూ కొవిడ్ మొదటి వేవ్ నుంచి మూడో వేవ్ వరకు ఏయే రాష్ట్రాల్లో కరోనా కేసుల తీవ్రత, మరణాలు ఎలా ఉన్నాయి అనేదానిపై సీరోసర్వే (Serosurvey) నిర్వహించింది. తమిళనాడులో 4వ సీరో సర్వే నిర్వహించగా.. రాష్ట్రంలో 88శాతం పెద్ద వయస్సు వారిలో కోవిడ్ యాంటీ బాడీలు ఉన్నాయని తేలింది. తమిళనాడులో 88శాతం మంది పెద్దలు, 68శాతం మంది 10 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో కొవిడ్ యాంటీబాడీలు తయారయినట్టు సర్వేలో గుర్తించారు.
డిసెంబర్ చివరి వారంలో తమిళనాడులో ఈ నాల్గవ సీరోసర్వేను నిర్వహించారు. అక్టోబర్-నవంబర్‌లో నిర్వహించిన సీరో సర్వేలో తమిళనాడు ప్రజలలో 32శాతం, ఏప్రిల్ 2021లో 29శాతం, జూలై-ఆగస్టు 2021లో 70శాతం సీరోపోజిటివిటీ (seropositivity)ని చూపించింది. అయితే.. 10ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు కరోనా పరీక్షలు నిర్వహించడం ఇదే తొలిసారి.. ఈ సర్వేను పర్యవేక్షించిన పబ్లిక్ హెల్త్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ TS సెల్వవినాయకం మాట్లాడుతూ.. సర్వే సమయంలో వారికి టీకాలు వేయలేదన్నారు.
అయినప్పటికీ వారిలో అత్యధిక స్థాయిలో IgG యాంటీబాడీస్ ఉన్నాయని తెలిపారు. సీరోపోజిటివిటీ (seropositivity) 18-44 ఏళ్ల మధ్య ఉన్నవారిలో 89.5శాతం, 45-59 మధ్య ఉన్నవారిలో 88.6శాతం, 50 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లలో 84.5శాతం మేర యాంటీ బాడీలు ఉన్నాయని గుర్తించారు. టీకాలు వేసిన వ్యక్తులలో 90శాతం మందిలో యాంటీబాడీలు కలిగి ఉండగా, టీకాలు వేయని వారిలో 69శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నాయని సర్వేలో తేలింది.
కరోనా టీకాలు పొందిన వ్యక్తుల్లో SARS CoV-2 IgG యాంటీబాడీలను కలిగి ఉన్నారని రుజువైంది. సెరోపోజిటివిటీ తిరువారూర్‌లో అత్యధికంగా (93శాతం), చెన్నైలో 88శాతంగా నమోదైంది. జనవరి మధ్యలో, తమిళనాడులో 97శాతం కేసులు ఒమిక్రాన్ వేరియంట్‌కి సంబంధించినవే ఉన్నాయి. డిసెంబర్ 7 వరకు నమోదైన అన్ని కేసులు డెల్టా వేరియంట్ కు సంబంధించినవే ఉన్నాయి.
Read Also : Pooja Hegde: ఐదు సినిమాలు రిలీజ్.. ఈ ఇయర్ తనదే అంటున్న బుట్టబొమ్మ!