Covid 19 : కోవిడ్ మూడో టీకా మార్గదర్శకాలు..ముందుగా వారికి మాత్రమే

జనవరి 10 నుంచి ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌తో పాటు 60 ఏళ్లు పైబడి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ప్రికాషన్ డోసు ఇవ్వనుంది కేంద్రప్రభుత్వం.

Covid Vaccine Third Dose : భారతదేశంలో ఓ వైపు కరోనా..మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ లు విజృంభిస్తున్నాయి. రోజు రోజు కేసుల సంఖ్య అధికమౌతున్నాయి. ఈ క్రమంలో..కేంద్రం అలర్ట్ అయ్యింది. మూడో డోస్ వేయాలని నిర్ణయం తీసుకుంది. దేశంలో 15 -18 సంవత్సరాల వయస్సున్న వారికి జనవరి మూడో తేదీ నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఇటీవలే ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ముందు జాగ్రత్త చర్యగా మూడో డోసు ఇస్తామని వెల్లడించారు. తాజాగా..దీనిపై 2021, డిసెంబర్ 28వ తేదీ మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.

Read More : Solar Power: సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో ఐఐటీ గుహాటీ కీలక పరిశోధన

ఫ్రంట్ లైన్, హెల్త్ వర్కర్లతో సహా 60 ఏళ్లకు పైబడిన వారికి జనవరి 10వ తేదీ నుంచి అదనపు వ్యాక్సిన్ డోస్ ఇస్తామని వెల్లడించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే వారిని ఫ్రంట్ లైన్ వర్కర్ల జాబితాలో కేంద్రం చేర్చింది. 60 ఏళ్లు, ఆపై వయస్సున్న వారికి అదనపు డోస్ కోసం డాక్టర్ సర్టిఫికేట్ అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. హెల్త్‌ వర్కర్లు, ఫ్రంట్ లైన్‌ వారియర్స్‌లో ఎవరు బూస్టర్ డోసుకు అర్హులన్న దానిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రెండో డోసు తీసుకుని తొమ్మిది నెలలు గడిచిన వారే బూస్టర్ డోస్‌కు అర్హులు అని ప్రకటించింది. జనవరి 10 నుంచి ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌తో పాటు 60 ఏళ్లు పైబడి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ప్రికాషన్ డోసు ఇవ్వనుంది కేంద్రప్రభుత్వం. అయితే వీరు గతంలో ఏ వ్యాక్సిన్ తీసుకుంటే దాన్నే మూడోసారి ఇస్తారు. వ్యాక్సిన్ మిక్సింగ్‌పై పూర్తిస్థాయి విశ్లేషణ లేకపోవడంతో.. సేమ్‌ వ్యాక్సిన్ ఇవ్వాలనే డిసైడ్ అయ్యింది.

Read More : Pan India Films: మారిన రూల్.. బాలీవుడ్‌కి బ్యాండ్ బజాయిస్తున్న టాలీవుడ్!

అటు దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ వైరస్‌ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మొన్నటి వరకు 17 రాష్ట్రాలకే పరిమితమైన వైరస్‌ మరో రెండు రాష్ట్రాలకూ విస్తరించింది. దీంతో ఒమిక్రాన్‌ బాధిత రాష్ట్రాల సంఖ్య 19కి చేరాయి. ఇప్పటివరకు దేశంలో విదేశాల నుంచి వచ్చిన ప్రైమరీ కాంటాక్ట్‌ వారికే ఒమిక్రాన్ సోకగా పలు రాష్ట్రాల్లో సెకండ్‌ కాంటాక్ట్‌ కూ సోకుతుండడం టెన్షన్ పెడుతోంది.

ట్రెండింగ్ వార్తలు