CoWIN data breach
CoWIN data breach: దేశంలో మరోసారి డేటా లీక్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కొవిన్ పోర్టల్ (Co-WIN portal) ద్వారా ప్రజల డేటా లీకైందని పలువురు విపక్ష నేతలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై భారత ప్రభుత్వం (Government of India) స్పందించింది.
” కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన కొవిన్ పోర్టల్ డేటా గోప్యత విషయంలో పూర్తిగా సురక్షితం. వివరాలు లీక్ అయ్యాయంటూ వస్తున్నదంతా నిరాధార ప్రచారమే. ఈ విషయంలో దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ను కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది ” అని భారత ప్రభుత్వం తెలిపింది.
ఇప్పటికే సెర్ట్-ఇన్ దీనిపై దర్యాప్తు జరుపుతోంది. కరోనా టీకా వేయించుకున్న పౌరుల వ్యక్తిగత వివరాలు కొవిన్ యాప్/పోర్టల్ నుంచి లీక్ అయ్యాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పౌరుల మొబైల్, ఆధార్, పాస్‌పోర్ట్, ఓటరు ఐడీలు, వారి కుటుంబ సభ్యుల వివరాలు వంటివి లీక్ అయ్యాయని కొందరు ఆరోపిస్తున్నారు.
There are several Opposition leaders which include:
1. Rajya Sabha MP & TMC Leader Derek O’Brien
2. Former Union Minister P. Chidambaram
3. Congress leaders Jairam Ramesh & K.C. Venugopal@derekobrienmp @PChidambaram_IN @Jairam_Ramesh @kcvenugopalmp
(2/7) pic.twitter.com/JnD5EKhPBO
— Saket Gokhale (@SaketGokhale) June 12, 2023