Credit-Card Fees : క్రెడిట్ కార్డు యూజర్లకు షాకింగ్.. ఆ కార్డుల ఫీజులు పెరుగుతున్నాయి..!

Credit-Card Fees : వచ్చే నెలలో క్రెడిట్ కార్డు ఫైనాన్స్ సంస్థలు వీసా, మాస్టర్ కార్డు.. తమ కార్డులపై చార్జీలను వడ్డించనున్నాయి. క్రెడిట్ కార్డుల చెల్లింపులు మరింత ప్రియం కానున్నాయి.

Credit-Card Fees : కరోనా ప్రారంభమైనప్పటి నుంచి అందరూ డిజిటల్ పేమెంట్లపైనే ఆధారపడుతున్నారు. ఏది కొనాలన్నా అన్నీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు లేదా డిజిటల్ వ్యాలెట్ల ద్వారానే పేమెంట్స్ చేస్తున్నారు. యూజర్ల వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని క్రెడిట్ కార్డు వంటి ఫైనాన్స్ సంస్థలు పలు ఆఫర్లతో క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. క్రెడిట్ కార్డు వినియోగదారులకు రెన్యువల్ ఫీ లేకుండా ఆఫర్ చేస్తుండటంతో ఎక్కువ మంది ఆయా క్రెడిట్ కార్డులను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. క్రెడిట్ కార్డులను చాలామంది అవసరానికి మించి ఎక్కువగా తీసుకుంటున్నారు.

క్రెడిట్ లిమిట్ మొత్తం ఖాళీ చేసేస్తున్నారు. ఇకపై క్రెడిట్ కార్డులను ఎలా పడితే అలా గీకితే అంతే సంగతలు.. భారీగా ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే.. మరికొద్ది రోజుల్లో క్రెడిట్ కార్డు ఫైనాన్స్ సంస్థలైన వీసా, మాస్టర్ కార్డు తమ కార్డులపై భారీ చార్జీలను వడ్డించనున్నాయి. ఇకపై క్రెడిట్ కార్డులు మరింత ప్రియంగా మారే అవకాశం కనిపిస్తోంది. మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే మీకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. క్రెడిట్ కార్డులపై ఆయా వీసా, మాస్టర్ కార్డ్ కంపెనీలు ప్రాసెసింగ్ ఫీజులను పెంచేందుకు రెడీ అవుతున్నాయి.

Credit Card Fees Visa, Mastercard Prepare To Raise Credit Card Fees

Credit-Card Fees :  రెండేళ్లుగా వాయిదా.. ఈసారి వడ్డన తప్పదు : 
The Wall Street Journal రిపోర్టు ప్రకారం.. రెండేళ్లగా కరోనా మహమ్మారి కారణంగా క్రెడిట్ కార్డులపై చార్జీలను పెంచడాన్ని కంపెనీలు వాయిదా వేస్తు వస్తున్నాయి. ఇప్పుడు కరోనా తీవ్రత తగ్గిపోయింది. క్రెడిట్ కార్డుల ఫీజులను పెంచేందుకు ఇదే సరైన సమయమని క్రెడిట్ కార్డుల కంపెనీలు భావిస్తున్నాయి. అందిన సమాచారం మేరకు.. వచ్చే నెల (ఏప్రిల్) నుంచి క్రెడిట్ కార్డు ఫీజులు భారీగా పెరగనున్నాయి. క్రెడిట్ కార్డుల వాడకంలో ముఖ్యంగా ఇంటర్ చేంజ్ ఫీజులు అధికంగా పెంచే అవకాశం కనిపిస్తోంది. సాధారణంగా క్రెడిట్ కార్డు యూజర్లు చెల్లించే మొత్తంపై మర్చంట్లు చార్జీలు విధిస్తున్నారు.

అయితే క్రెడిట్‌ కార్డు యూజర్లు తమ కార్డులతో కార్డ్ నెట్‌వర్క్ ద్వారా నిర్ణయించే ఛార్జీలను మర్చంట్లు చెల్లిస్తారు. అయితే ఈ రుసుము కార్డు సంబంధిత బ్యాంకుకు మాత్రమే పేమెంట్ అవుతుంది. తద్వారా సదరు మర్చంట్లు క్రెడిట్‌ కార్డు యూజర్లపై ఇంటర్‌ ఛేంజ్‌ ఫీజులను బనాయించే అవకాశం లేదంటున్నారు నిపుణులు. ఇంటర్‌ఛేంజ్‌ ఫీజులపెంపు ద్వారా సాధారణ రిటైల్‌ ఛార్జీలు సైతం పెరగనున్నాయి. ఇంటర్‌ఛేంజ్‌ ఫీజుల పెంచడంతో మాస్టర్ కార్డ్ సుమారు 330 మిలియన్ల డాలర్ల వరకు అదనంగా లాభాన్ని ఆర్జించనుంది. ఇప్పటికే చాలా బ్యాంకులు క్రెడిట్‌కార్డుల వినియోగంపై పలు రివార్డు పాయింట్లను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.

Read Also : New Smartphones: మార్కెట్లో కొత్త ఫోన్ల సందడి: ఐఫోన్, శాంసంగ్, రెడ్మి నుంచి కొత్త ఫోన్లు

ట్రెండింగ్ వార్తలు