New Smartphones: మార్కెట్లో కొత్త ఫోన్ల సందడి: ఐఫోన్, శాంసంగ్, రెడ్మి నుంచి కొత్త ఫోన్లు

శాంసంగ్ నుంచి Galaxy F23 5G, షావోమి నుంచి Redmi Note 11 Pro సిరీస్, యాపిల్ నుంచి SE 5G 2022 ఫోన్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి.

New Smartphones: మార్కెట్లో కొత్త ఫోన్ల సందడి: ఐఫోన్, శాంసంగ్, రెడ్మి నుంచి కొత్త ఫోన్లు

New Phones

New Smartphones: భారత్ లో ఆర్ధిక సంవత్సరం(Fiscal Year) మారుతున్న వేళ..స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు రానున్న ఆర్ధిక సంవత్సరాన్ని లాభాలతో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అందులో భాగంగా కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. భారత్ లో టాప్ బ్రాండ్స్ అయిన శాంసంగ్, షావోమి, యాపిల్ సంస్థలు సరికొత్త స్మార్ట్ ఫోన్లను భారత విఫణిలోకి ప్రవేశపెట్టాయి. శాంసంగ్ నుంచి Galaxy F23 5G, షావోమి నుంచి Redmi Note 11 Pro సిరీస్, యాపిల్ నుంచి SE 5G 2022 ఫోన్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. బ్రాండ్ వారీగా ఈ స్మార్ట్ ఫోన్ల ఫీచర్స్, ధరలు ఎలా ఉన్నాయంటే!.

Also read: Anand Mahindra: రూ.12వేలకే జీప్ దొరికేది.. ఆ రోజులే బాగున్నాయంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్

Samsung Galaxy F23 5G: స్మార్ట్ ఫోన్లలో రారాజు శాంసంగ్..మొదటిసారిగా బడ్జెట్ ఫోన్లలో 5G సాంకేతికతను జోడించింది. ఇప్పటి వరకు శాంసంగ్ నుంచి వచ్చిన 5G ఫోన్లలో ఈ Galaxy F23 ధర తక్కువ. కేవలం రూ.15,999 ప్రారంభ ధరతో ఈ 5G ఫోన్ అందుబాటులో ఉంది. ఫీచర్స్ విషయానికొస్తే.. 6.6 inch Full HD+ 120Hz డిస్ప్లే, 4 GB RAM+128 GB ROM, 5000 mAh బ్యాటరీ వంటి రెగ్యులర్ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. వెనుక భాగంలో 50MP + 8MP + 2MP ట్రిపుల్ కెమెరా సెటప్, ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. Qualcomm Snapdragon 750G ప్రాసెసర్ తో వస్తున్న ఈ Galaxy F23 5G..”హై ఎండ్ గేమింగ్” కి కూడా పనికొస్తుందని సంస్థ తెలిపింది.

Also read: Flipkart: మహిళలందరిని క్షమాపణలు కోరిన ఫ్లిప్‌కార్ట్

Apple iphone SE 2022: ఐఫోన్ ప్రియులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఐఫోన్ SE.. ఎట్టకేలకు విడుదలైంది. భారత వినియోగదారులను తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఈ ఫోన్ SE 2022ను రూ.43,900 తక్కువ ధరకు మార్కెట్లో విడుదల చేసింది యాపిల్ సంస్థ. స్క్రీన్ (డిస్ప్లై), కెమెరా సెటప్ మినహా.. ఈ కొత్త ఐఫోన్ హై ఎండ్ ఫోన్లకు ధీటుగా ఫీచర్స్ కలిగి ఉందని యాపిల్ సంస్థ ప్రకటించింది. 4.7-అంగుళాల డిస్‌ప్లే, A15 బయోనిక్ చిప్, 12MP సింగిల్ కెమెరా, 20W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్స్ ఈ కొత్త iphone SE 2022లో ఉన్నాయి. మార్చి నెల మూడో వారం నుంచి ఈ కొత్త ఫోన్ సేల్స్ ప్రారంభమౌతాయి.

Also read: BSNL Fiber : BSNL చీపెస్ట్ ఇంటర్నెట్ ప్లాన్ ఇదే.. 1TB డేటా మీ సొంతం.. ధర ఎంతంటే?

Redmi Note 11 Pro series: చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ “mi” తమ “రెడ్మి” బ్రాండ్ నుంచి విడుదల చేసిన మరో స్మార్ట్ ఫోన్ సిరీస్ “Note 11 Pro”. గతేడాది 11 సిరీస్ ను భారత్ లో ప్రవేశపెట్టిన షావోమి.. ఇప్పుడు 11 సిరీస్ లో Redmi Note 11 Pro+ 5G, Redmi Note 11 Pro అనే రెండు టాప్ ఎండ్ ఫోన్స్ ను విడుదల చేసింది. 5జి సాంకేతికత మినహా ఈ రెండు ఫోన్లలో దాదాపుగా ఒకే రకమైన ఫీచర్స్ ఉన్నాయి. Redmi Note 11 Pro+ 5Gలో.. 6.67-అంగుళాల Full HD+ AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 695 SoC ప్రాసెసర్, 108MP ట్రిపుల్ కెమెరా సెటప్, 5000 mAh బ్యాటరీ 67W ఛార్జింగ్, లిక్విడ్ కూల్ టెక్నాలజీ వంటి ఫీచర్స్ ఉన్నాయి. Redmi Note 11 Proలో మాత్రం.. MediaTek Helio G96 SoC ప్రాసెసర్, 108MP + 8MP + 2MP + 2MP క్వాడ్ కెమెరా సెటప్, అదనంగా ఉన్నాయి. రూ.17,999 ప్రారంభ ధరతో ఈ Note 11 Pro సిరీస్ అతిత్వరలో సేల్ కి రానున్నాయి.

ఈ ఫోన్లు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తో పాటు ఆయా కంపెనీల వెబ్ సైట్లలోనూ అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్స్ తో పాటుగా ఇతర బ్రాండ్స్ కూడా కొత్త మోడల్స్ ను భారత మార్కెట్లోకి విడుదల చేశాయి.

Also read: Apple Products: ఈ యాపిల్ ప్రొడక్ట్‌లు కొనాలనుకుంటే కాస్త ఆగండి