జవాన్‌లపై జవాన్ కాల్పులు.. ముగ్గురు మృతి

  • Publish Date - March 21, 2019 / 03:10 AM IST

జవాన్‌ల మధ్య వచ్చిన విభేదాల కారణంగా ఒక జవాన్ మరో ముగ్గురు జవాన్‌లను కాల్చా చంపేశాడు. జమ్మూ కశ్మీర్‌లోని ఉదమ్‌పూర్ ప్రాంతంలోని బాటల్ బాల్లిన్‌లో 187వ సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌లో బుధవారం రాత్రి 10గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అజీత్ కుమార్ అనే సీఆర్‌పీఎఫ్ జవాను తన తోటి జవాన్‌లు అయిన రాజస్థాన్‌లోని ఝున్‌ఝునూకు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఆర్ పొకార్మల్, ఢిల్లీకి చెందిన యోగేంద్ర శర్మ, హర్మానాకు చెందిన ఉమెద్ సింగ్‌లను సర్వీస్ రైఫెల్‌తో చంపేశాడు. అనంతరం తనను తానే కాల్చుకున్నాడు. వెంటనే స్పందించిన సిబ్బంది.. దాడిలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ముగ్గురు చనిపోగా.. కాల్చిన అజీత్ కుమార్ పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.