బీహార్ లో త్వరలో ఎన్నికలు : ‘justice for Sushant’ బీజేపీ పోస్టర్లు

  • Publish Date - September 7, 2020 / 08:59 AM IST

బీహార్ లో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర బీజేపీ కల్చర్ విభాగం ‘justice for Sushant’ పేరిట పోస్టర్స్, కరపత్రాలు, మాస్క్ లు విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.




ఈ ఘటన రాజకీయ రంగు అలుముకుంది. సీబీఐ విచారణకు సుప్రీం ఆదేశించింది. ఈ క్రమంలో…రాష్ట్ర బీజేపీ కల్చర్ విభాగం సుశాంత్ ఫొటో కూడిన సుమారు 30 వేల పోస్టర్స్, 30 వేల మాస్క్ లు, స్టిక్కర్లు తయారు చేసి ప్రజల ముందుకు వెళుతున్నారు. “Na bhoole hain! Na Bhoolne denge!! పేరిట ఉన్న వీటిని ప్రజల ఇళ్ల తలుపులపై అతికిస్తున్నారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు ఆ పార్టీ లీడర్స్.
https://10tv.in/american-scientists-redesign-face-mask/
ఇది ఎన్నికల స్టంట్ కాదని బీజేపీ అంటోంది. సుశాంత్ అకాలమరణం చాలా మందికి షాక్ ఇచ్చిందని, ఈ ఘటనలో కప్పిపుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి ఆర్.కె.సింగ్ వెల్లడించారు. బీహార్ లో త్వరలో జరగబోయే ఎన్నికలతో ఈ అంశం ముడిపడలేదన్నారు.




నలంద జిల్లాలో రాజ్ గిరి ఫిల్మ్ సిటీ, పాట్నాలోని రాజీవ్ నగర్ చౌక్ పేర్లను మార్చి..సుశాంత్ పేరు పెట్టాలని బీజేపీ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్..రోడ్ల శాఖ మంత్రి నంద కిషోర్ యాదవ్ కు పంపారు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పచెప్పాలని బీహార్ ప్రభుత్వం సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు..సీబీఐకి అప్పచెప్పిన తర్వాత..నితీష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. సుశాంత్ కేసును సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తు చేపడుతున్నాయి. రియా చక్రవర్తిని ఎన్ సీబీ ప్రశ్నిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు