రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలోని మాల్‌పురా ప్రాంతంలో దసరా పండుగ వేళ ఘర్షణలు చెలరేగాయి. రెండు వర్గాలు దాడులకు దిగాయి. వీరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తర్వాత ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముందస్తు జాగ్రత్తలో భాగంగా కర్ఫ్యూ విధించారు. ఈ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. దసరా పండుగ సందర్భంగా 2019, అక్టోబర్ 08వ తేదీ మంగళవారం రాత్రి రావణాసురుడి బొమ్మను దగ్ధం చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
ఊరేగింపు చేస్తుండగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఘర్షణల సమయంలో నిరసనకారులు కొన్ని దుకాణాలకు నిప్పు పెట్టారు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీనిపై అజ్మీర్ రేంజ్ జీపీ సంజీప్ కుమార్ మాట్లాడారు. కొంతమంది గొడవపడి రాళ్లు రువ్వుకోవడంతో ఆందోళన హింసాత్మక మలుపు తీసుకుందన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇరువర్గాలను శాంతింప చేసే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టారు. కొంతమందిని అరెస్టు చేసిన పీఎస్‌కు తరలించారు. అయితే..వారిని విడిచిపెట్టాలంటూ కొంతమంది నిరసన చేపట్టారు. శాంతిభద్రతకు విఘాతం కలుగకుండా ఉండేందుకు పోలీసులు భారీగా మోహరించారు.
Read More : కళకళలాడుతున్న మహాబలిపురం : భారత్‌కు చైనా అధ్యక్షుడు