Cyclone Dana: తీరం దాటిన ‘దానా’ తుపాను.. ఆ ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవు

‘దానా’ తీరందాటే సమయంలో ఒడిశాలో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఆరు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Dana Cyclone

Cyclone Dana: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దానా’ తుపాను తీరం దాటింది. ఒడిశాలోని కేంద్రపరా జిల్లాలోని భితర్కానిక జాతీయ పార్క్, భద్రక్ జిల్లాలోని దామ్రా మధ్య శుక్రవారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో తుపాను తీరం దాటినట్లు వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. మరికొద్ది గంటల్లో బలహీనపడి  తుపానుగా దానా మారనుంది. తుపాను తీరం దాటే సమయంలో 120 కిలో మీటర్ల వేగంతో తీవ్రంగా గాలులు వీచాయి. గాలుల దాటికి పలుచోట్ల చెట్లు నేలకూలాయి. తుపాను కారణంగా ఒడిశాలోని 16 జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఈ తుపాను ప్రభావం ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై తీవ్రంగా పడింది. దీంతో ఆ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆయా జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటిచాలని అధికారులు రెండు రాష్ట్రాలకు సూచించారు.

Also Read: Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు..!

‘దానా’ తీరందాటే సమయంలో ఒడిశాలో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఆరు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒడిశాలో ఏడు వేల పునరావాలస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్రలోని ఓడరేవులకు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని, ప్రజలు అలర్ట్ గా ఉండాలని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

 

తపాను ప్రభావంతో కోల్ కతా, భువనేశ్వర్ ఎయిర్ పోర్టును గురువారం మూసి ఉంచనున్నారు. ఒడిశాలోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తుపాను ప్రభావం తగ్గేవరకు మూసి ఉంచనున్నారు. రెండు రాష్ట్రాల్లో మొత్తం 400 రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే శాఖ పేర్కొంది.