Cyclone Tauktae : తౌక్టే తుఫాన్ బీభత్సం.. కొట్టుకుపోయిన నౌక, అందులో 273మంది

దేశ పశ్చిమ తీరంలో ‘తౌక్టే’ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. అతిభీకరంగా మారిన తుఫాన్ ప్రస్తుతం గుజరాత్‌ వైపు వేగంగా పయనిస్తోంది. దీంతో ముంబైలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తుఫాన్ ధాటికి బాంబే హై ఫీల్డ్ ప్రాంతంలో ఓ నౌక ప్రమాదానికి గురైంది. అలల ధాటికి

Cyclone Tauktae

Cyclone Tauktae : దేశ పశ్చిమ తీరంలో ‘తౌక్టే’ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. అతిభీకరంగా మారిన తుఫాన్ ప్రస్తుతం గుజరాత్‌ వైపు వేగంగా పయనిస్తోంది. దీంతో ముంబైలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తుఫాన్ ధాటికి బాంబే హై ఫీల్డ్ ప్రాంతంలో ఓ నౌక ప్రమాదానికి గురైంది. అలల ధాటికి నౌక కొట్టుకుపోతోంది. అందులో 273 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. వారికి సాయం చేయాలని సూచనలు అందడంతో నేవీ సిబ్బంది రంగంలోకి దిగింది.

తుఫాన్ లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఐఎన్ఎస్ కొచ్చి, ఐఎన్ఎస్ తల్వార్ పడవలను వెంటనే ఘటనా స్థలానికి పంపింది. రెస్క్యూ ఆపరేషన్ కోసం మరికొన్ని పడవలు, విమానాలను అధికారులు సిద్ధంగా ఉంచారు.