cyrus road accident
Cyrus Mistry Death: వ్యాపార దిగ్గజం, టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ (54)తో పాటు జహంగీర్ పండోల్ ఆదివారం జరిగిన కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. గుజరాత్ నుంచి ముంబయి వస్తుండగా వీరు ప్రయాణిస్తోన్న కారు పాల్ ఘర్ జిల్లాలోని సూర్యనందిపై ఉన్న వంతెన వద్ద డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసుల విచారణలో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Cyrus Mistry: సైరస్ మిస్త్రీ దుర్మరణం.. విచారణకు ఆదేశించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం
కారు ప్రమాద సమయంలో ప్రముఖ గైనకాలజిస్టు అనహితా పండోల్ డ్రైవ్ చేస్తుంది. ఆమె భర్త డేరియస్ ముందు సీట్లో కూర్చుకున్నాడు. సైరస్ మిస్త్రీ, జహంగీర్ పండోల్ వెనుక సీట్లో కూర్చున్నారు. ప్రధానంగా ఈ ప్రమాదానికి కారణంగా అతివేగమేనని తేలింది. వీరు కేవలం 9 నిమిషాల్లోనే 20 కిలో మీటర్లు ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. పాల్ ఘర్ జిల్లాలోని చరోటీ చెక్ పోస్ట్ వద్ద ఉన్న సీసీ టీవీ పుటేజ్ లను పరిశీలించిన పోలీసులు ఈ విషయాన్ని నిర్ధారించారు. ఆదివారం మధ్యాహ్నం 2.21 గంటలకు చరోటీ చెక్ పోస్టు దాటగా, ఈ చెక్ పోస్టుకు 20 కిలో మీటర్లు దూరంలో కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు సమయం మధ్నాహ్నం 2.30గంటలుగా పోలీసులు గుర్తించారు.
I resolve to always wear my seat belt even when in the rear seat of the car. And I urge all of you to take that pledge too. We all owe it to our families. https://t.co/4jpeZtlsw0
— anand mahindra (@anandmahindra) September 5, 2022
సైరస్ మిస్త్రీ మరణం పట్ల మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రా భావోద్వేగమైన ట్వీట్ చేశాడు. పోలీసుల విచారణలో కారు ప్రమాద సమయంలో వెనుకాల సీటులో కూర్చున్న సైరస్ మిస్త్రీ, జహింగీర్ పండోల్ ఇద్దరు సీట్ బెల్ట్ పెట్టుకోలేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సీటు బెల్టు పెట్టుకొని ఉంటే వారు మృతిచెందే వారు కాదని పోలీసులు అంచనా వేశారు. ఈ విషయంపై ఆనంద్ మహింద్రా ట్వీట్ చేశాడు. ప్రతిఒక్కరూ సీటు బెల్టు ధరించాలని కోరారు. కారులో వెనుక సీట్లో కూర్చున్నాసరే ఎల్లప్పుడూ సీటు బెల్టు ధరించాలని నిశ్చయించుకున్నానని, మీరందరూ కూడా ఆ ప్రతిజ్ఞ తీసుకోవాలని కోరుతున్నానని అన్నారు. మన కుటుంబాలకు మనం ఎంతగానో రుణపడి ఉన్నామంటూ ట్విటర్ లో భావోద్వేగ భరితంగా రాసుకొచ్చారు.
Hard to digest this news. I got to know Cyrus well during his all-too-brief tenure as the head of the House of Tata. I was convinced he was destined for greatness. If life had other plans for him, so be it, but life itself should not have been snatched away from him. Om Shanti ?? https://t.co/lOu37Vs8U1
— anand mahindra (@anandmahindra) September 4, 2022