Cyrus Mistry: సైరస్ మిస్త్రీ దుర్మరణం.. విచారణకు ఆదేశించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం

ప్రముఖ వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ మృతిపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక అందించాలని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పోలీసులను ఆదేశించారు. ఈ అంశంపై డీజీపీతో మాట్లాడినట్లు తెలిపారు.

Cyrus Mistry: సైరస్ మిస్త్రీ దుర్మరణం.. విచారణకు ఆదేశించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం

Cyrus Mistry: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ మరణించిన ఘటనపై విచారణకు ఆదేశించారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో రోడ్డు ప్రమాదంలో మిస్త్రీ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Ghulam Nabi Azad: కాంగ్రెస్‌కు నా రక్తం ఇచ్చాను.. కానీ, నన్ను మర్చిపోయింది: గులాంనబీ ఆజాద్

ముంబైకి వంద కిలోమీటర్ల దూరంలో, ‌పాల్‌ఘర్ వద్ద మిస్త్రీ ప్రయాణిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కారు డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆయనతోపాటు మరొకరు కూడా మరణించారు. ఇంకో ఇద్దరు గాయపడ్డారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. డాక్టర్ అనహితా పండోలే కారును నడుపుతున్నారు. ఆమె వేగంగా కారు నడపడంతో అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె భర్త కూడా ప్రాణాలు కోల్పోయాడు.

Singer Vaishali Bursala: సింగర్ వైశాలి హత్య కేసులో వీడిన మిస్టరీ.. చంపించింది స్నేహితురాలే.. ఎందుకో తెలుసా?

కాగా, ఈ ప్రమాదంపై డీజీపీతో మాట్లాడినట్లు, సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని కోరినట్లు దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. సైరస్ మిస్త్రీ మృతిపై పలువురు రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.