Enforcement Directorate: మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేసిన మరుసటిరోజే ఆమె మేనల్లుడికి ఈడీ నోటీసులు

కేంద్ర దర్యాప్తు సంస్థలు మరోసారి తన మేనల్లుడు తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీని పిలిచి విచారించే అవకాశం ఉందంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఆయనకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు పంపింది. బొగ్గు అక్రమ రవాణా కేసులో అభిషేక్‌ బెనర్జీ కోల్‌కతాలోని తమ కార్యాలయానికి శుక్రవారం ఉదయం హాజరుకావాలని ఆదేశించింది. అభిషేక్ బెనర్జీతో పాటు ఆయన భార్య సోదరికి కూడా నిన్న నోటీసులు అందాయి.

Enforcement Directorate: కేంద్ర దర్యాప్తు సంస్థలు మరోసారి తన మేనల్లుడు తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీని పిలిచి విచారించే అవకాశం ఉందంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఆయనకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు పంపింది. బొగ్గు అక్రమ రవాణా కేసులో అభిషేక్‌ బెనర్జీ కోల్‌కతాలోని తమ కార్యాలయానికి శుక్రవారం ఉదయం హాజరుకావాలని ఆదేశించింది. అభిషేక్ బెనర్జీతో పాటు ఆయన భార్య సోదరికి కూడా నిన్న నోటీసులు అందాయి.

దీనిపై అభిషేక్ సహా తృణమూల్ నేతలు మండిపడ్డారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అభిషేక్ కు నోటీసులు పంపుతున్నారని అంటున్నారు. అభిషేక్ సహా పలువురికి నోటీసులు అందుతాయని మమతా బెనర్జీ మందుగానే ఊహించారని, ఇప్పుడు అదే జరిగిందని తృణమూల్‌ కాంగ్రెస్ నేత సౌగత్‌ రాయ్‌ అన్నారు.

కాగా రెండు రోజుల క్రితమే మమతా బెనర్జీ మాట్లాడుతూ… ‘అభిషేక్ బెనర్జీ తాజాగా తన ప్రసంగంలో అద్భుతంగా మాట్లాడారు. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు అభిషేక్ కి నోటీసులు పంపే అవకాశం ఉంది. అభిషేక్ భార్యను కూడా వారు వదలడం లేదు. రెండేళ్ళ చిన్నారికి కూడా నోటీసులు పంపడానికి వారు వెనకాడరు’ అని మమతా బెనర్జీ చెప్పారు.

India exercising with Russia: రేపటి నుంచి రష్యా సైనిక విన్యాసాలు.. పాల్గొననున్న భారత్, ఇతర దేశాలు.. అమెరికా ఆందోళన

ట్రెండింగ్ వార్తలు