India exercising with Russia: రేపటి నుంచి రష్యా సైనిక విన్యాసాలు.. పాల్గొననున్న భారత్, ఇతర దేశాలు.. అమెరికా ఆందోళన

 రష్యా రేపటి నుంచి చేపడుతున్న సైనిక విన్యాసాల్లో భారత్ పాల్గొననుంది. అలాగే, చైనాతో పాటు అనేక దేశాలు ఇందులో పాల్గొంటాయి. దీనిపై అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు శ్వేత సౌధం ప్రకటించింది. ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం మొదలు పెట్టిన అనంతరం నిర్వహిస్తోన్న అతి పెద్ద సైనిక విన్యాసాలు ఇవి. ‘రష్యాతో కలిసి ఇతర దేశాలు ఈ విన్యాసాలు చేస్తుండడం పట్ల అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తోన్న వేళ ఈ చర్యలు సరికాదు. అయితే, ఇందులో పాల్గొంటోన్న దేశాలకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంది’ అని శ్వేత సౌధ ప్రెస్ సెక్రెటరీ కరెన్ జీన్-పియర్ పేర్కొన్నారు.

India exercising with Russia: రేపటి నుంచి రష్యా సైనిక విన్యాసాలు.. పాల్గొననున్న భారత్, ఇతర దేశాలు.. అమెరికా ఆందోళన

India exercising with Russia

India exercising with Russia: రష్యా రేపటి నుంచి చేపడుతున్న సైనిక విన్యాసాల్లో భారత్ పాల్గొననుంది. అలాగే, చైనాతో పాటు అనేక దేశాలు ఇందులో పాల్గొంటాయి. దీనిపై అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు శ్వేత సౌధం ప్రకటించింది. ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం మొదలు పెట్టిన అనంతరం నిర్వహిస్తోన్న అతి పెద్ద సైనిక విన్యాసాలు ఇవి. ‘రష్యాతో కలిసి ఇతర దేశాలు ఈ విన్యాసాలు చేస్తుండడం పట్ల అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తోన్న వేళ ఈ చర్యలు సరికాదు. అయితే, ఇందులో పాల్గొంటోన్న దేశాలకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంది’ అని శ్వేత సౌధ ప్రెస్ సెక్రెటరీ కరెన్ జీన్-పియర్ పేర్కొన్నారు.

ఈ విషయంపై భారత్ పై ఎందుకు ఒత్తిడి తీసుకురాకూడదు? అన్న ప్రశ్నకు కూడా ఆమె స్పందించారు. తాము అన్ని దేశాల విషయంలోనూ ఆందోళన వ్యక్తం చేస్తున్నామని ఇప్పటికే చెప్పానని అన్నారు. రష్యాలో చేయనున్న విన్యాసాలపై అమెరికా చర్యలు తీసుకుంటుందా? అన్న ప్రశ్నకు ఆమె స్పందిస్తూ… ఈ విషయంలో తాను చెప్పడానికి ఏమీ లేదని వ్యాఖ్యానించారు. కాగా, వొస్తోక్‌-2022 పేరిట రేపటి నుంచి సెప్టెంబరు 7వ తేదీ వరకు రష్యా పలు దేశాలతో కలిసి సైనిక విన్యాసాలు చేపట్టనుంది. ఇందులో భారత్‌, చైనా సహా అనేక దేశాలకు చెందిన సుమారు 50 వేల మంది సైనికులు పాల్గొననున్నారు.

తమ మిత్రదేశాలకు సైనిక భద్రత పెంచడమే లక్ష్యంగా ఈ విన్యాసాలు చేపడుతున్నట్లు చెప్పింది. ఈ విన్యాసాల్లో 140 యుద్ధ విమానాలు, 60 యుద్ధనౌకలు పాలు పంచుకుంటున్నాయి. వొస్తోక్‌-2022లో తాము పాల్గొంటామని చైనా ఇప్పటికే ప్రకటించింది. అంతేగాక, భారత్‌ సహా బెలారస్‌, తజకిస్థాన్‌, మంగోలియా వంటి దేశాలూ పాల్గొంటాయని చెప్పింది. గత ఏడాది కూడా రష్యాలో సైనిక విన్యాసాలు నిర్వహించారు. ఇందులో 17 దేశాలు పాల్గొన్నాయి. వాటిలో భారత్‌, చైనా, పాకిస్థాన్‌ కూడా ఉండడం గమనార్హం.

Telangana Covid News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..