Mamata Banerjee: వీల్ ఛైర్‌లోనే ప్రచారానికి బయల్దేరిన మమతా బెనర్జీ

నందిగ్రామ్ లో ప్రచారం చేస్తుండగా జరిగిన దాడిలో గాయపడ్డ మమతా బెనర్జీ ఎట్టకేలకు బయటకొచ్చారు. నాలుగు రోజులుగా చికిత్స్ తీసుకుంటున్న ఆమె పట్టుదలతో ప్రచారం పూర్తి చేయాలని వీల్ ఛైర్ లోనే..

Mamata Banerjee:  నందిగ్రామ్ లో ప్రచారం చేస్తుండగా జరిగిన దాడిలో గాయపడ్డ మమతా బెనర్జీ ఎట్టకేలకు బయటకొచ్చారు. నాలుగు రోజులుగా చికిత్స్ తీసుకుంటున్న ఆమె పట్టుదలతో ప్రచారం పూర్తి చేయాలని వీల్ ఛైర్ లోనే పూర్తి చేయాలనుకుంటున్నారు. 66ఏళ్ల పార్టీ చీఫ్ ఆదివారం మధ్యాహ్నం జరగనున్న సభకు హాజరుకానున్నారు. కోల్ కతాలో జరిగే అతి పెద్ద రోడ్ షోకు వీల్ చైర్ లోనే వెళ్తారు.

గురువారం హాస్పిటల్ నుంచి వీడియో కాల్ లో మాట్లాడిన ఆమె.. తనపై గుర్తు తెలియని నలుగురైదుగురు వ్యక్తులు దాడి చేసినట్లు తెలిపింది. ఎలక్షన్ కమిషన్ కు ఆమెపై జరిగిన దాడి గురించి తృణమూల్ కాంగ్రెస్ నేతలు కంప్లైంట్ చేశారు. ప్రస్తుత దేశ రాజకీయాల్లో మమతపై దాడి హాట్ డిబేట్ గా మారింది.

ఎలక్షన్ కమిషన్ పై ఆరోపణలు గుప్పిస్తూ.. తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ పై దాడి జరగడంపై బెంగాల్ పోలీసులు కంప్లైంట్ చేస్తున్నారు. దీనిపై బీజేపీ కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఎలక్షన్ కమిషన్ హై లెవల్ ఇన్వెస్టిగేషన్ చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా ఘటన గురించి పూర్తి వీడియోను రిలీజ్ చేసింది.

ఇది ముఖ్యమంత్రిపై భయంకరమైన దాడిగా పేర్కొంటూ చీఫ్ ఎలక్షన్ కమిషన్ 24గంటల్లోనే బెంగాల్ పోలీస్ చీఫ్ ను పదవి నుంచి తప్పించింది. పైగా ఈ నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అభిప్రాయం అడగలేదు.

 

 

ట్రెండింగ్ వార్తలు