Dd
DD YouTube Channels : దూర్శదర్శనతో కూడా కలిపి ప్రసార భారతి డిజిటల్ ఛానళ్ళకు మన దేశంతోపాటు విదేశాల్లో కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్‌లో వీటికి రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
కేంద్ర సమాచార, ప్రసార (ఐ అండ్ బీ) మంత్రిత్వ శాఖ రాజ్యసభకు తెలిపిన వివరాల ప్రకారం… పాకిస్థాన్‌తోపాటు అమెరికా, సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రేక్షకులు ప్రసార భారతి డిజిటల్ చానల్స్‌ను బాగా ఆదరిస్తున్నారు. ఈ ఆదరణ అంతా కేవలం మూడేళ్లలోనే పెరిగిందని కూడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. నేపాల్‌లో కూడా కరోనా సమయంలో ప్రసార భారతి యూట్యూబ్ ఛానళ్లకు ఆదరణ పెరిగింది.
ప్రసార భారతికి 170కిపైగా యూట్యూబ్ చానళ్ళు ఉన్నాయి. ఆలిండియా రేడియో, దూరదర్శన్ నెట్‌వర్క్ కార్యక్రమాలు వీటిలో ప్రసారమవుతాయి. ప్రసార భారతి యూట్యూబ్ చానళ్ళకు పాకిస్తాన్ నుంచి 2018లో 64 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇది 2020లో 1.33 కోట్లకు పెరిగింది. ఈ ఏడాదిలో నవంబర్ చివరినాటికి 1.30 కోట్ల వ్యూస్ వచ్చాయి. భారత్ తర్వాత ఈ డిజిటల్ చానల్స్‌ను అత్యధికంగా వీక్షిస్తున్నది పాకిస్థానీలే. ఇక,ఆలిండియా రేడియో (ఏఐఆర్), దూరదర్శన్ చానళ్ళను 2018లో 52.26 లక్షల మంది అమెరికన్ యూట్యూబ్ యూజర్లు వీక్షించారు.2020లో 1.28 లక్షల మంది వీక్షించారని కేంద్రం పేర్కొంది. యూఏఈలో 2018లో 37 లక్షల వ్యూవర్‌షిప్ రాగా, ఇది 2020లో 82.72 లక్షలకు పెరిగింది.
ALSO READ PM Modi : పటేల్ జీవించి ఉంటే..గోవాకు ముందుగానే విముక్తి