Donate Kidneys : భర్తల కోసం హిందూ,ముస్లిం మహిళలు ఒకరికొకరు..కిడ్నీ దానాలు..మానవత్వమే తప్ప మతం లేదని నిరూపించిన అతివలు

భర్తలకోసం హిందూ,ముస్లిం మహిళలు ఒకరికొకరు..కిడ్నీ దానాలు చేసుకున్నారు. ముస్లిం వ్యక్తి హిందూ మహిళ,హిందూ వ్యక్తికి ముస్లిం మహిళ కిడ్నీ దానాలు చేసుకోవటం మానవత్వానికి మతం లేదనిపించింది

hindu muslim womens donate kidneys each others husbands : కష్టానికి కులం లేదు. మానవత్వానికి మతం లేదు. జబ్బుకు డబ్బు గురించి తెలియదు. ప్రాణాన్ని రక్షించుకోవాలంటే డబ్బు అవసరమే. కానీ మనిషికి మనిషి సహాయంగా ఉంటే నీ కష్టం నాది.. అని అనుకుంటే మాత్రం డబ్బుల ప్రస్తావనే ఉండదు.అదే చేశారు ఓ హిందూ మహిళా మరో ముస్లిం మహిళా కలిసి. తమ భర్తల్ని రక్షించుకోవటానికి ఈ రెండు మతాలకు చెందిన మహిళలు చేసిన తెగువ..చూపించిన ఔదార్యం..ఒకరి కొకరు చేసుకుని ఇద్దరు కుటుంబాలను నిలబెట్టకున్న తీరు దేశ వ్యాప్తంగా ప్రశసలు అందుకుంటున్నాయి. ఇంతకీ ఆ ఇద్దరు మహిళలు ఎవరు?వారి చేసిన పని ఏంటీ అంటే..

తమ భర్తల ప్రాణాలు కాపాడటం కోసం పరస్పరం కిడ్నీలు దానం చేసుకున్నారు ఇద్దరు మహిళలు. కిడ్నీలు పాడై బాధపడుతున్న ఓ ముస్లిం వ్యక్తికి ఓ హిందూ మహిళ కిడ్నీ దానం చేయగా.. ఆ హిందూ మహిళ భర్తకు సదరు ముస్లిం బాధితుడి భార్య కిడ్నీ దానం చేసింది. దీంతో వీరిద్దరి భర్తల ప్రాణాలు నిలబడ్డాయి. వారి కుటుంబాలు సంతోషిస్తున్నాయి. మానవత్వం ముందు మతం, కులం అనేవి తలదించుకుంటాయని ఈ హిందూ- ముస్లిం మహిళలు మరోసారి నిరూపించారు.

Read more : Organ Donation: మరణం తర్వాత కూడా జీవించే గొప్పదానం..8మందికి కొత్త జీవితమిచ్చే మహద్భాగ్యం

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌ కు చెందిన సుష్మా ఉనియాల్‌, సుల్తానా అలీ అనే ఇద్దరు గృహిణులది ఒకే సమస్య. వీళ్లద్దరి భర్తల కిడ్నీలు పాడైపోయాయి. కొత్త కిడ్నీ అమరిస్తేనే వారు బతకగలుగుతారు. తమ భర్తలకు కిడ్నీలు దానం చేసినందుకు సిద్ధంగా ఉన్నా.. వారి రక్తం మ్యాచ్‌ కాలేదు. దీంతో ఏం చేయలేని పరిస్థితి. తమ భర్తల్ని రక్షించుకోవటానికి ఇద్దరు నానా కష్టాలు పడ్డారు. కిడ్నీ దాతల కోసం ఆ ఇద్దరు గృహిణిలు తిరగని హాస్పిటల్ లేదు. చేయని ప్రయత్నం లేదు. పేపర్ లో ప్రకటల నుంచి సోషల్ మీడియాలో వేడుకోలు దాకా ఎన్నో చేశారు.అలా వారాలు గడిచిపోతున్నాయి. నెలలు కూడా తరలిపోతున్నాయి. కానీ కిడ్నీ దాతల జాడే లేదు.వారికి కిడ్నీదాతలు లభించలేదు.

50 ఏళ్ల సుష్మ భర్త వికాస్‌ ఉనియాల్ కు రెండు కిడ్నీలు ఫెయిల్‌ అయ్యాయి. దాదాపు మూడేళ్లుగా డయాలసిన్‌ మీదనే ఆధారపడి జీవిస్తున్నాడు. మరోపక్క ముస్లిం మహిళ సుల్తానా భర్త అష్రాఫ్‌ వయస్సు 51 సంవత్సరాలు. ఆయనది కూడా అదే పరిస్థితి. ఇద్దరివి సాధారణ కుటుంబాలే. చిన్న చిన్న పనులు చేస్తే గడిచే కుటుంబాలే. కానీ భర్తల వైద్యం కోసం ప్రతి నెలా రూ.20 వేలు ఖర్చు చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితులు అవి. మరోదారి లేదు. ఓ పక్క కిడ్నీ డోనర్ కోసం గాలింపు.మరోపక్క డయాలసిస్. అలాగే గడిచిపోతున్నాయి రోజులు.కానీ ఏదో ఆశ. మరేదో నమ్మకం.

Read more : Constable Heart donation : కానిస్టేబుల్ గుండె దానం..పంజాగుట్ట నిమ్స్ లో పెయింటర్ హార్ట్ సర్జరీ

ఆ ఆశే వారిద్దరిని కలిపింది. ఆ నమ్మకమే వారిద్దరి భర్తల ప్రాణాలు కాపాడింది. కాదుకాదు వారి తెగువే వారి భర్తల ప్రాణాలు కాపాడాయి. అలా రోజులు గడుస్తున్న క్రమంలో సుష్మ బ్లడ్‌ గ్రూప్‌ సుల్తానా భర్త అష్రాఫ్‌కు సరిపోతుందని, అలాగే సుల్తానా బ్లడ్‌ గ్రూప్‌ సుష్మ భర్త వికాస్‌కు సరిపోతుందని గుర్తించారు. అటువంటి సందర్భం ఇద్దరికి ఒకేసారి కలగటం మరో విశేషం.

డెహ్రాడూన్‌లోని హిమాలయన్‌ ఆస్పత్రి సీనియర్‌ నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ షాబాజ్‌ అహ్మద్ ఈ విషయాన్ని గుర్తించి సుఫ్మ, సుల్తాలకు చెప్పారు. అంతే ఇద్దరి మొహాల్లోను సంతోషం వెల్లివిరిసింది. అలా ఇరు కుటుంబాలు కలిసి మాట్లాడుకున్నాయి. అలా అందరి అనుమతితో లభించాక..డాక్టర్లు చేయాల్సిన పరీక్షలన్నీ చేశారు.ఆపరేషన్లకు ఏర్పాట్లు చేశారు. అలా వారి భర్తలకు పరస్పరం కిడ్నీలు దానం చేసుకున్నారు హిందూ ముస్లిం మహిళలు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ల తరువాత చేయాల్సిన చికిత్సలతో ఇద్దరూ కోలుకుంటున్నారు.

Read more : World Organ Donation Day : అవయవ దానం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఇతనే

కాగా ఈ ఆపరేషన్‌ కోసం రెండు కుటుంబాలు రూ.ఆరు లక్షల ఖర్చు చేశాయి. అలా ఇద్దరి కుటుంబాల్లోను ఆనందం కూడా నిండింది. కాగా ఇక్కడ మరో విషయం ఏమిటంటే..కొన్ని నిబంధనల ప్రకారం.. రక్తసంబంధికులు మాత్రమే కిడ్నీ చేసేందుకు అర్హులై ఉంటారు. మానవ అవయవ మార్పిడి చట్టం 2011కు చేసిన సవరణ కారణంగా ఈ అవయవ మార్పిడి సాధ్యమైంది. మ్యాచ్ అవ్వాలేగానీ ఎవరి అవయం ఎవరికైనా అమర్చవచ్చు. దీంతో మరణాలు సంఖ్య కూడా తగ్గుతోంది.చట్టాలు అనేవి మనుషులు ఏర్పరచుకున్నవే. ఆచట్టాలు ప్రాణాలను తీసేవిగా ఉండకూడదు.అందుకే అవయవ మార్పిడి చట్టంలో జరిగిన మార్పులు మంచివే..

ట్రెండింగ్ వార్తలు