World Organ Donation Day : అవయవ దానం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఇతనే
ప్రపంచంలో మొట్టమొదటి అవయవదానం..1954లో అమెరికాలోని బోస్టన్‌లోని పీటర్ బెంట్ బ్రీగమ్ ఆస్పత్రిలో జరిగింది. రోనాల్డ్ లీ హెర్రిక్ అనే వ్యక్తి తన కవల సోదరుడైన రోనాల్డ్ జే హెర్రిక్‌కి కిడ్నీని దానం చేశారు. మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న్ సోదరుడి కోసం లీ హెర్రిక్ తన కిడ్నీ ఇచ్చి ప్రాణం కాపాడారు. డాక్టర్ జోసెఫ్ ముర్రే చేసిన 1954లో జరిగిన ఈ ఆపరేషన్ విజయవంతం అయ్యింది. హెర్రిక్ సోదరుల అవయవమార్పిడి శస్త్ర చికిత్స వైద్య రంగంలో ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది. అవయవదానం చేస్తే ఎటువంటి ప్రమాదం లేదనే విషయాన్ని లోకానికి చాటి చెప్పింది.

The First Successful Organ Transplant
World Organ Donation Day 2021: అవయవదానం. ఒకప్పుడు ఇది పెద్ద విషయంగా ఉండేది.కానీ అవయవ దానంపై అవగాహన పెరుగుతుందనే చెప్పాలి. గతంలో కంటేఇప్పుడు పరిస్థితి మెరుగుపడుతోంది. దీంతో తాము చనిపోతూ కూడా మరికొంతమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు సహృదయులు. బతికున్నప్పుడే కాదు.. చనిపోతూ నలుగురికి ప్రాణం పోయడం మనిషికి దక్కిన ఏకైక వరం అనే చెప్పాలి. అందరిలో అవగాహన కల్పించేందుకే ప్రతీ ఏడు ఆగస‍్టు 13న ‘ప్రపంచ అవయవ దాన దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. ఆగస్టు 13 ప్రపంచ అవయవ దాన దినోత్సవం. ఈ సందర్బంగా మొట్టమొదటి అవయవ దానం చేసి నేటి అవయవ దానానికి శ్రీకారం చుట్టిన ఓ మహోన్నత వ్యక్తి గురించి తెలుసుకుందాం.
ప్రపంచంలో మొట్టమొదటి అవయవదానం..1954లో అమెరికాలోని బోస్టన్‌లోని పీటర్ బెంట్ బ్రీగమ్ ఆస్పత్రిలో జరిగింది. రోనాల్డ్ లీ హెర్రిక్ అనే వ్యక్తి తన కవల సోదరుడైన రోనాల్డ్ జే హెర్రిక్‌కి కిడ్నీని దానం చేశారు. మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న్ సోదరుడి కోసం లీ హెర్రిక్ తన కిడ్నీ ఇచ్చి ప్రాణం కాపాడారు. డాక్టర్ జోసెఫ్ ముర్రే చేసిన 1954లో జరిగిన ఈ ఆపరేషన్ విజయవంతం అయ్యింది. హెర్రిక్ సోదరుల అవయవమార్పిడి శస్త్ర చికిత్స వైద్య రంగంలో ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది. అవయవదానం చేస్తే ఎటువంటి ప్రమాదం లేదనే విషయాన్ని లోకానికి చాటి చెప్పింది. కిడ్నీ మార్పిడి తర్వాత హెర్రిక్ 8 సంవత్సరాలు జీవించాడు. అలాగే కిడ్నీ దానం చేసిన లీ హెర్రిక్ మరో 56 ఏళ్ల పాటు జీవించి 2010లో వృద్ధాప్య సంబంధిత సమస్యలతో కన్నుమూశారు. ఈ ఆపరేషన్‌ని సక్సెక్స్ పుల్ గా చేసిన డాక్టర్ జోసెఫ్ ముర్రే..ఆ తరువాత కాలంలో నోబెల్ బహుమతి పొందాడు.
హెర్రిక్ సోదరుల అవయవమార్పిడి విజయవంతం కావటంతో అవయవదానం చేస్తే ఎటువంటి ప్రమాదం లేదనే విషయాన్ని లోకానికి చాటి చెప్పినట్లైంది. ఇక అప్పటి ప్రపంచ వ్యాప్తంగా అవయవదానాలు కొనసాగుతూనే ఉన్నాయి. అలా ఒక్క అమెరికాలోనే ఇప్పటి వరకు చూసుకుంటే 43,000 పైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగాయి. అవయవదానంతో ఒక వ్యక్తి నుంచి ఎనిమిది రకాల అవయవాలను ఇతరులకు దానం చేసే వీలుంది. గుండె, మూత్రపిండాలు, పాంక్రియాస్, ఊపిరితిత్తులు, కాలేయం, పేగులు, చర్మపు టిష్యు, ఎముకల్లోని మజ్జ, చేతులు, ముఖం, స్టెమ్‌సెల్స్, కళ్లని ఇతరులకు మార్పిడి చేసే అవకాశం ఉంది. కిడ్నీ, కాలేయ మార్పిడి, ఎముక మజ్జ బతికుండగానే దగ్గరి వాళ్ల కోసం దానం చేస్తుంటారు. అది అవసరమైనవారికి అన్ని రకాలు పరీక్షలు చేసి డాక్టర్లు రోగులకు ప్రాణదానం చేస్తుంటారు.