Constable Heart donation : కానిస్టేబుల్ గుండె దానం..పంజాగుట్ట నిమ్స్ లో పెయింటర్ హార్ట్ సర్జరీ

రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ కానిస్టేబుల్ గుండెను మలక్ పేటలోని యశోధా హాస్పిటల్ నుంచి పంజాగుట్టలోని నిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. ఈ గుండెను రోగికి అమర్చనున్నారు.

Constable Heart donation : కానిస్టేబుల్ గుండె దానం..పంజాగుట్ట నిమ్స్ లో పెయింటర్ హార్ట్ సర్జరీ

Donation Of Heart

Heart surgery to a painter in nims Hospital : అవయదానం ఎంతోమంది రోగులకు పునర్జన్మనిస్తోంది. అవయవ మార్పి ద్వారా కొత్త జీవితాలు కొనసాగిస్తున్నారు. అలా మరో రోగికి గుండె ఆపరేషన్ కోసం బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించిన గుండెను తరలింపు జరిగింది. ఆ గుండెను పంజాగుట్టలోని నిమ్స్ హాస్పిల్ లో ఉన్న ఓ రోగికి అమర్చనున్నారు.దీంట్లో భాగంగానే మ‌ల‌క్‌పేట య‌శోద ఆస్ప‌త్రి నుంచి నిమ్స్‌కు బుధ‌వారం (సెప్టెంబర్ 15,2021) ఉద‌యం గ్రీన్ చానెల్ ద్వారా ప్ర‌త్యేక అంబులెన్స్‌లో గుండెను త‌ర‌లించారు. ఈ గుండెను ప్ర‌మాదంలో గాయ‌ప‌డి.. బ్రెయిన్ డెడ్ అయిన వ్య‌క్తి నుంచి గుండెను సేక‌రించారు. ఈ గుండెను నిమ్స్ డాక్టర్లు అమర్చనున్నారు.

Read more: World Organ Donation Day : అవయవ దానం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఇతనే

గత మూడు రోజుల క్రితం అంటే సెప్టెంబర్ 12వ తేదీన గొల్ల‌గూడెం వ‌ద్ద ఖ‌మ్మం జిల్లాకు చెందిన కానిస్టేబుల్ వీర‌బాబు రోడ్డుప్ర‌మాదానికి గుర‌య్యాడు. బైక్ అదుపుత‌ప్పి వీర‌బాబు కింద ప‌డిపోవ‌డంతో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు అయిన వీరబాబు మలక్ పేటలోనే యశోధ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం వీరబాడు బ్రెయిన్ డెడ్ అయ్యింది. ఈ విషయాన్ని య‌శోద వైద్యులు నిన్న ప్ర‌క‌టించారు. దీంతో వీరబాబు కుటుంబ సభ్యులు పెద్ద మనస్సు చేసుకున్నారు. వీరబాబు తమకు దూరమైనా ఆయన గుండె ద్వారా మరో వ్యక్తికి కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకున్నారు.

Read more : Organ Donation: మరణం తర్వాత కూడా జీవించే గొప్పదానం..8మందికి కొత్త జీవితమిచ్చే మహద్భాగ్యం

దీంట్లో భాగంగా వీరబాబు గుండె దానానికి అంగీకరించారు. గుండె ఆపరేషన్ కోసం ఎదురు చూస్తున్న మరో బాధితుడు వీరబాబు గుండె ద్వారా శ్వాసించటానికి సిద్ధంగా ఉన్నాడు. అలా గుండె కోసం 30 ఏళ్ల వయస్సున్న ఓ పెయింటర్ జీవ‌న్‌దాన్‌లో న‌మోదు చేసుకున్నాడు. ఈక్రమంలో బ్రెయిన్ డెడ్ అయిన కానిస్టేబుల్ వీరబాబు గుండెను ఆ పెయింట‌ర్‌కు నిమ్స్ వైద్యులు అమ‌ర్చ‌ేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. దీంట్లోభాగంగా గ్రీన్ చానెల్ ద్వారా గుండె గుండె ను నిమ్స్‌ హాస్పిటల్ కు తరలించారు. ఆ గుండెను పెయింటర్ కు నిమ్స్ వైద్య బృందం అమర్చనున్నారు. కాగా నిమ్స్ హాస్పిటల్ లో ఇప్పటికే ప‌లుమార్లు గుండె మార్పిడి శ‌స్త్ర చికిత్సలు జ‌రిగిన విషయం తెలిసిందే.