Delhi bans firecrackers: ఢిల్లీలో జనవరి 1 వరకు టపాసులపై నిషేధం

బాణసంచా వాడకం, తయారీ, నిల్వ, విక్రయాలను జరపకూడదని చెప్పింది.

firecrackers

వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2025 జనవరి 1 వరకు అన్ని రకాల టపాసులను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలోని అన్ని రకాల బాణసంచా వాడకం, తయారీ, నిల్వ, విక్రయాలను జరపకూడదని చెప్పింది.

ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ ప్లాట్‌ఫాంలలోనూ టపాసులను అమ్మడానికి వీలులేదని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ తెలిపింది. ఇందుకు సంబంధించిన నోటీసును ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఎక్స్‌లో షేర్‌ చేశారు. చలికాంలో ఢిల్లీలో వాయుకాలుష్య సమస్య మరింత తీవ్రతరమవుతుందని, బాణసంచా కూడా అందుకు కారణమవుతుందని చెప్పారు.

చలికాలంలో పెరుగుతున్న కాలుష్యం దృష్ట్యా నేటి నుంచి వచ్చే ఏడాది జనవరి 1 వరకు టపాసులపై నిషేధం విధిస్తున్నామని తెలిపారు. ఢిల్లీ ప్రజలందరు సహకారం అందించాలని కోరింది. మరోవైపు, ఢిల్లీలో గాలి నాణ్యత సోమవారం ప్రమాదకర కేటగిరీ స్థాయికి దిగజారింది. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇవాళ ఉదయం 370గా ఉంది.

మాది లంచాల ప్రభుత్వం కాదు: “పల్లె పండుగ”లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్