మాది లంచాల ప్రభుత్వం కాదు: “పల్లె పండుగ”లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

పరిపాలన ఎలా చెయ్యాలనే విషయంలో చంద్రబాబే తనకు స్ఫూర్తి అని తెలిపారు.

మాది లంచాల ప్రభుత్వం కాదు: “పల్లె పండుగ”లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Updated On : October 14, 2024 / 1:37 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కూటమి సర్కారు ఇవాళ పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కృష్ణాజిల్లా కంకిపాడు నుంచి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చేతుల మీదుగా పల్లె పండుగ, పంచాయతీ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. గతంలో కేటాయించిన నిధులు ఏమయ్యాయో తెలియదని అన్నారు. తమది లంచాల ప్రభుత్వం కాదని, మంచి ప్రభుత్వమని చెప్పారు. పరిపాలన ఎలా చెయ్యాలనే విషయంలో చంద్రబాబే తనకు స్ఫూర్తి అని తెలిపారు.

పరిపాలన అనుభవం కావాలంటే ఎంతో కృషిచేయాలనని అన్నారు. ప్రభుత్వ పనిలో గుట్టు ఎందుకని అంతా పారదర్శకంగా ఉండాలని పవన్ కల్యాణ్ చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరో తెలియదని, ఏరోజూ… గ్రామసభలు, తీర్మానాలు చేయలేదని అన్నారు.

తాను వచ్చాక సమీక్ష చేసినా కూడా ఆ నిధుల జాడ లేకుండా పోయిందని తెలిపారు. గతంలో కేటాయించిన నిధులు ఏమయ్యాయో తెలీదని అన్నారు. తాము శాఖల వారీగా సమీక్షలు చేసి వాస్తవాలు చెప్పాలని భావించామని చెప్పారు.

సినిమాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. “ముందు బాధ్యతలు.. ఆ తర్వాతే సినిమాలు.. టాలీవుడ్‌లో ఎవరితోనూ నేను పోటీపడను.. నేను సినిమా చేయాలంటే డబ్బులు కూడా ఉండాలి.. సినిమా హీరోలు ఎవరైనా బాగుండాలని కోరుకుంటా.. సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుండాలి.. రాష్ట్రాన్ని బాగుచేసుకుని ఆ తర్వాత విందులు, వినోదాలు చేసుకుందాం” అని అన్నారు.

Jani Master : జానీ మాస్టర్ ఇష్యూపై జనసేన నేత.. ఆమె మాకు కూడా మెసేజ్‌లు చేసింది.. ప్లాన్ చేసి ట్రాప్ చేశారనిపిస్తుంది..