ఢిల్లీలో మంచు తుఫాను…జనాల్లో జనవరి- 6టెన్షన్

ఢిల్లీ గత వారం రోజులుగా చలి తీవ్రత బాగా పేరిగింది. ఇప్పటికే గత డిసెంబర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా…119 ఏళ్ల అత్యల్ప ఉష్ణోగ్రత రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. చలి గుప్పెట్లో బతుకున్నఢిల్లీ వాసులు జనవరిలో అయితే అసలు రోడ్లపై తిరిగే పరిస్థితి కనిపించదంట. ఢిల్లీలో మంచు తుఫాను… మంచులో చిక్కుకున్న వాహనాలు… రోడ్లపై ఎక్కడ చూసినా మంచు… ఇలాంటి వార్తల్ని మనం జనవరిలో వింటామని చెబుతున్నారు ఢిల్లీ వాతావరణ అధికారులు. ఇప్పటికే జీరో డిగ్రీలను టచ్ చేసేదాకా వెళ్లిన వాతావరణం… జనవరిలో పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంటుందంటున్నారు.
ప్రస్తుతం పశ్చిమం నుంచీ బలమైన చల్లటి గాలులు వీస్తున్నాయి. ఇవి జనవరి అంతా వీస్తూనే ఉంటాయని వాతావరణ అధికారులు తెలిపారు. జనవరి 6 – 8 మధ్య మూడ్రోజులపాటూ వాన, మంచు కురిసి మంచు తుఫానులో ఢిల్లీ చిక్కుకుంటుందని అంటున్నారు. ఇక జనవరి 6న ఏం జరుగుతుందన్న టెన్షన్ ప్రజల్లో మొదలైంది. మంచు తుఫాను వల్ల డిసెంబర్‌లో కంటే జనవరిలో ఢిల్లీతో పాటు ఉత్తరభారతదేశంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని ప్రైవేట్ వాతావరణ విభాగం స్కైమెట్ తెలిపింది. సహజంగా రాత్రివేళ ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయి. జనవరి 6 – 8 మధ్య మాత్రం పగటివేళ కూడా ఉష్ణోగ్రతలు పడిపోతాయని అధికారులు అంటున్నారు.
కొత్త ఏడాదిలో ఉత్తరాదిలోని కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడూ లేనిది తొలిసారిగా 1 డిగ్రీ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో ఉష్ణోగ్రత… గత ఎండాకాలంలో 50 డిగ్రీలకు చేరింది. అలాంటి ప్రదేశంలో ఇప్పుడు 1.5 డిగ్రీల వెన్నులో వణుకు పట్టించే ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీలో కూడా అత్యల్పంగా 2.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆరేళ్లలో ఇదే అత్యల్పం.