Farmers Protest: ఢిల్లీకి దూసుకొస్తున్న రైతులు.. హైఅలర్ట్‌

పంటలకు మద్దతు ధర, ఎమ్మెస్పీ కోసం కేంద్రం వేసిన కమిటీలో రైతులకి స్థానం సహా రైతు సమస్యల పరిష్కారానికి..

రైతులు మంగళవారం ఛలో ఢిల్లీ చేపడుతున్నారు. దీంతో ఢిల్లీలో భద్రతను భారీగా పెంచారు. ఢిల్లీ సరిహద్దుల్లో హైఅలర్ట్ ప్రకటించారు. రైతులు ట్రాక్టర్లలో బయలుదేరారు.

రైతుల నిరసనలను విరమింపజేసేందుకు ఇప్పటికే కేంద్ర మంత్రులు రంగంలోకి దిగారు. రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపారు. చండీగఢ్‌లోని సెక్టార్ 26లోని మహాత్మా గాంధీ స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో సమావేశం నిర్వహించారు.

రైతు నాయకులతో కేంద్రమంత్రులు కేంద్ర మంత్రులు అర్జున్‌ ముండా, పీయూష్‌ గోయల్‌, నిత్యానంద్‌ రాయ్‌ చర్చించారు. రైతులపై నమోదైన కేసుల ఉపసంహరణ, నకిలీ విత్తనాలు, రసాయనాలకు కఠిన శిక్ష అంశాలపై రైతులకు సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటామని ఇప్పటికే మంత్రులు అంగీకరించారు.

పంటలకు మద్దతు ధర, ఎమ్మెస్పీ కోసం కేంద్రం వేసిన కమిటీలో రైతులకి స్థానం సహా రైతు సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తున్నాయి రైతు సంఘాలు. వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా కేంద్రం రైతులకిచ్చిన డిమాండ్లను నెరవేర్చాలంటూ ఢిల్లీలో మంగళవారం నిరసన తెలుపుతామని రైతు సంఘాలు చెప్పాయి.

Tamilnadu Governor : మరోసారి వివాదాస్పదంగా తమిళనాడు గవర్నర్ తీరు.. ఏం జరిగిందో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు