Delhi CM Kejriwal : ఒక్కొక్కరికి ఎమ్మెల్యే టికెట్, రూ.25కోట్లు ఆఫర్ చేశారు.. బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు

మాకున్న సమాచారం ప్రకారం ప్రకారం ఇప్పటి వరకు ఏడుగురు ఎమ్మెల్యేలను బీజేపీ పెద్దలు సంప్రదించారు, వారందరూ బీజేపీ ఆఫర్ తిరస్కరించామని నాతో చెప్పారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు.

Kejriwal

Kejriwal Alleges BJP: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశాడు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేయాలని బీజేపీ చూస్తుందని ట్విటర్ వేదికగా ఆరోపణలు గుప్పించారు. ఇటీవల ఢిల్లీలోని మా ఏడుగురు ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించిందని, కొన్నిరోజుల తరువాత కేజ్రీవాల్ ను అరెస్టు చేస్తున్నామ్.. ఆ తరువాత ఎమ్మెల్యేలపై విరుకుపడతామని బెదిరింపులకు గురిచేశారని అన్నారు. 21మంది ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు.. ఇతరులతో కూడా మాట్లాడుతున్నారని తెలిసింది. రూ.25కోట్లు ఇచ్చి ఎన్నికల్లో బీజేపీ టికెట్ పై పోటీ చేసేందుకు అవకాశం ఇస్తామంటున్నారని బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు.

Also Read : Actor Vijay Thalapthy : తమిళ రాజకీయాల్లో గ్రాండ్‌ ఎంట్రీకి సన్నద్ధమవుతున్న విజయ్ దళపతి.. లోక్ సభ బరిలో నిలుస్తారా?

బీజేపీ పెద్దలు 21 మంది ఆప్ ఎమ్మెల్యేలను సంప్రదించారని చెబుతున్నా.. మా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఏడుగురు ఎమ్మెల్యేలను సంప్రదించారని, వారందరూ బీజేపీ ఆఫర్ తిరస్కరించామని నాతో చెప్పారని కేజ్రీవాల్ అన్నారు. లిక్కర్ స్కామ్‌పై దర్యాప్తు చేసేందుకు నన్ను అరెస్ట్ చేస్తారని బీజేపీ ప్రచారం చేస్తుందని.. కానీ, లిక్కర్ స్కాం పేరుతో నన్ను అరెస్టుచేసి ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత తొమ్మిదేళ్లలో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎన్నో కుట్రలు చేశారు.. కానీ అవి ఏమాత్రం విజయం సాధించలేదు. దేవుడు, ప్రజలు ఎల్లప్పుడూ మాకు మద్దతుగా ఉన్నారు, ఆప్ ఎమ్మెల్యేలంతా ఐక్యంగా కలిసి ఉన్నారని కేజ్రీవాల్ అన్నారు.

Also Read : లోక్‌సభ ఎన్నికలకు కేసీఆర్ సరికొత్త వ్యూహం.. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు వీళ్లేనా?

ఈసారికూడా బీజేపీ తమ దుర్మార్గపు ఉద్దేశాలలో విఫలమతుంది. ఢిల్లీ ప్రజలకోసం ఆఫ్ ప్రభుత్వం ఎంత కృషి చేసిందో ప్రజలకు తెలుసు. బీజేపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆప్ చాలా సాధించిందని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ ప్రజలు ఆప్ ను అమితంగా ప్రేమిస్తారు. ఎన్నికల్లో ఆప్ ని ఓడించలేరు. కాబట్టి నకిలీ మద్యం కుంభకోణం సాకుతో నన్ను అరెస్టు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు.